
ఇప్పుడు రకుల్ కి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ రకుల్‌ను వరించిందట. నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న చిత్రంలో హీరోయిన్గా ఈ అమ్మడిని ఎంపిక చేశారట. చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ఏడాది రెండో భాగంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. అలాగే బాలీవుడ్లో కూడా రకుల్‌కు మంచి ఆఫర్ ఆమె చేతిలో ఉంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ సరసన నటించే అవకాశం రకుల్ దక్కించుకుందని తెలుస్తోంది. అజయ్ హీరోగా తెరకెక్కనున్న `థ్యాంక్ గాడ్` చిత్రంలో రకుల్ నటించనుందని సమాచారం.
ఈ రెండు చిత్రాలపై రకుల్ చాలా నమ్మకాలు పెట్టుకుందట. ఈ రెండిట్లో తనకు మంచి పాత్రలు వచ్చాయని, సినిమాలు కూడా విజయవంతమైతే రకుల్ తన కేరీర్ మళ్ళీ ఊపుఅందుకుంటుందని ఆశపడుతోంది ఈ అమ్మడు. చూడాలి ఏం జరుగుతుంది అనేది.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is…
The Andhra Pradesh State Election Commission (SEC) has rescheduled municipal elections in 99 urban local…