
‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వం వహించిన “మిస్టర్ పర్ ఫెక్ట్”లో అవకాశం వచ్చిందని, ఓ నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేస్తానని, కానీ ఎందుకో ఆ సినిమా నుండి అర్ధంతరంగా తీసేసారాని, ఇలాగే కొన్ని పెద్ద సినిమాలకు కూడా ముందుగా తీసుకుని, ఆ తర్వాత మార్చేసారని తన చేదు అనుభవాల జాబితాను చెప్పుకొచ్చింది. అలాగే మరీ చిన్న వయసులో ఉన్నపుడు పూరీ జగన్నాధ్ ఓ కధ చెప్పారని, అయితే అప్పుడు చదువు పూర్తి చేసిన తర్వాత వద్దామని ఆ సినిమా చేయలేదని తెలిపింది.
ప్రతి హీరోయిన్ కెరీర్ లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమే. ఎంతటి టాప్ స్థానానికి చేరుకున్న హీరోయిన్ అయినా, కెరీర్ తొలినాళ్ళల్లో ఇలాంటి అనుభూతులను చవిచూడాల్సిందే. అయితే కొందరు ఓపెన్ గా చెప్తుంటారు, మరికొందరు గుట్టుగా దాచుకుంటారు. రకుల్ మాత్రం కాస్త ఓపెన్ అయ్యింది. ఆ సినిమాలో నిజంగా రకుల్ చేసుంటే… సందీప్ కిషన్ తో కాకుండా ప్రభాస్ తో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైన మెరిసిపోయేది. అయితేనేం… ప్రస్తుతం టాలీవుడ్ నెంబరింగ్ లో రకుల్ దే అగ్రస్థానం కదా!
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…