
అలా కాకుండా కష్టపడకుండా… దేవుడికి వంద కొబ్బరికాయలు కొడతాను, తిరుపతి కొండ ఎక్కుతానంటే కుదరదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కంటే ముందు ఏదేదో చేశాను, నాకే తెలియదు! మా నాన్న ఆర్మీలో ఉన్నప్పుడు… ఎక్కువ సినిమాలు చూసేందుకు అవకాశమిచ్చేవారు కాదు. కాకపోతే, హీరోయిన్ ని కావాలని నాకు ఉండేది. నేను ఢిల్లీలో మోడలింగ్ చేసేటప్పుడు.. దక్షిణాది చిత్ర పరిశ్రమ ఇంత పెద్దదని నాకు తెలియదు. పాకెట్ మనీ కోసం కన్నడ సినిమాలో నేను మొట్టమొదటిసారిగా నటించాను.
ఒక నెలలో ఐదు లక్షల రూపాయలు వచ్చేస్తాయి… స్విఫ్ట్ కారు కొనుక్కోవచ్చు అనే ఊహాల్లో ఉన్నాను. అప్పటికీ, అసలు నాకేమీ తెలియదు… ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. అరవై రోజులు అయితే నేను నటించను, పది రోజులు అయితే నటిస్తానని వారికి చెప్పాను. తెలుగులో మొట్టమొదటి సారిగా ‘కెరటం’ సినిమాలో నటించాను’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. సహజంగా హీరోయిన్లు గాలిలో మేడలు కడుతుంటారు గానీ, రకుల్ చాలా సహజంగా ఆలోచిస్తుండడం చెప్పుకోదగ్గ విషయమే.
నాడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి శ్రీకారం చుట్టి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్ ఆయనను…
The Congress party is historically famous for leading group politics. There is very little dirty…