అల్లు అర్జున్ పై రామ్ చరణ్ పైచెయ్యి!

Ram Charan Allu Arjunమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ డిస్నీ+హాట్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమింపబడ్డారు. అతను ఇప్పటికే హాట్ స్టార్ ప్రింట్ మరియు టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం షూట్ చేశారు.

ADVERTISEMENT

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఈ యాప్‌ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు త్వరలో ప్రసారం కానున్నాయి.

రామ్ చరణ్ కజిన్ అల్లు అర్జున్ ప్రాంతీయ తెలుగు ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ ప్లాట్‌ఫాం – ఆహా వీడియోకు బ్రాండ్ అంబాసిడర్ . ఈ స్ట్రీమింగ్ కంపెనీలో అల్లు అర్జున్ కుటుంబానికి కూడా వాటా ఉంది.

కానీ ఒక అంతర్జాతీయ యాప్‌ ను ఎండార్స్ చెయ్యడంతో రామ్ చరణ్ తన కజిన్ పై పైచేయి సాధించినట్టు అయ్యింది. ఎందుకనో రామ్ చరణ్, చిరంజీవిలు మొదటి నుంచి ఆహాకు దూరంగానే ఉంటున్నారు.

రామ్ చరణ్ సోదరి సుస్మిత జీ గ్రూప్ కోసం గతంలో ఒక వెబ్ సిరీస్‌ నిర్మించారు. హాట్ స్టార్ తో పాటు, రామ్ చరణ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సువర్ణభూమి తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఇది ఇలా ఉండగా… రామ్ చరణ్ ఇటీవల ఎస్ ఎస్ రాజమౌళి యొక్క ఆర్ఆర్ఆర్ లో తన భాగాన్ని పూర్తి చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో కొన్ని భాగాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తవుతాయి. ఆ తరువాత అతను త్వరలో తన తదుపరి #RC15 ను ప్రారంభించే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories