
అసలు ఈ గోల గత ఏడాది ఆర్ఆర్ఆర్ మార్చిలో రిలీజైనప్పటి నుంచే ఉంది. మా హీరో బాగా చేశాడంటే మా హీరో బాగా చేశాడని తారక్ చరణ్ ల అభిమానులు పరస్పరం మాములుగా కవ్వించుకోలేదు. ఇద్దరిదీ ఒకే సింక్ వచ్చేలా రాజమౌళి వాళ్ళను ఎంత కష్టపెట్టాడో రిహార్సల్స్ పేరిట ఎంత ఒళ్ళు హూనం చేశాడో పలు ఇంటర్వ్యూలలో, ఆన్ ది సెట్స్ వీడియోలలో అందరూ చూశారు. అందుకే తెరమీద నాటు నాటు అంత లయబద్ధంగా అద్భుతంగా కుదిరింది. విదేశీయులు గొర్రెలు కాదు అమెరికా ఐమ్యాక్స్ స్క్రీన్ దగ్గరికి వెళ్లి డాన్స్ చేయడానికి. అది అంత బాగా పండింది కాబట్టే ఎంజాయ్ చేశారు మళ్ళీ మళ్ళీ చూశారు తమ వంతుగా ప్రమోషన్ చేశారు.
మన జనాలేమో ఇలా చేస్తున్నారు. సాంకేతికంగా చెప్పాలంటే ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో చోటు దక్కించుకోవడమంటే అది ఆడియోకి సంబంధించింది. కాకపోతే విజువల్ గా నృత్యం బాగా కుదరడంతో దాని ప్రభావం నేరుగా మ్యూజిక్ మీద పడి పాజిటివ్ ఇంపాక్ట్ పెరిగిపోయింది. అంతే తప్ప ఇద్దరు స్టెప్పులు వేశారని అకాడెమి చోటు ఇవ్వలేదు. ఇది కాసేపు పక్కనపెడితే మరీ దారుణంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి తారక్ కాళ్ళ దగ్గర చరణ్ ఉన్నట్టు, జూనియర్ చేస్తుంటే చరణ్ అబ్బురపడి చూస్తున్నట్టు ఇలా చిత్ర విచిత్ర మీమ్స్ తో తమ అధమ స్థాయి మనస్తత్వాన్ని బయట పెట్టుకున్న వాళ్ళు వేలు కాదు లక్షల్లో ఉన్నారు. ఇంత ఇన్ సెక్యూరిటీ ఎందుకో అర్థం కాదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే వైసిపికి చెందిన కొందరు మద్దతుదారులు రాజమౌళి కమ్మ అనే కారణంతో నాటు నాటుకి ఆ డాన్స్ ఏంటి ఆస్కార్ ఎందుకు ఇస్తారని రకరకాలుగా వెలికి అర్థాలు తీసినవాళ్లు ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టి క్యాంపైన్ చేశారనే ప్రచారం జరిగింది. కేవలం సొమ్ములకే ఆస్కార్ వచ్చే పనైతే నేను బాహుబలికే తీసుకొచ్చేవాడినని శోభు యార్లగడ్డ చెప్పిన మాటలు ఈ మట్టి బుర్రలకు అర్థమయ్యేదెలా. అసలు ఇలాంటి టాపిక్కుల మీద గంటల తరబడి కాలాన్ని వృధా చేస్తున్న తీరు చూస్తుంటే ఒకవైపు తెలుగు సినిమా ఆస్కార్ వేదికపై ఎత్తులో నిలబడుతోందని గర్వపడాలో పైన చెప్పిన కుంచిత మనస్థత్వాల వల్ల టాలీవుడ్ మీద బయటవాళ్ళ అభిప్రాయాలు కిందకు వెళ్తున్నాయని బాధ పడాలో సమాధానం దొరకని ప్రశ్నే.
The Supreme Court’s observations on children’s internet access raise a serious question: When laws and…
ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి.…