
ఈ నేపథ్యంలో ఈ మధ్య ఈ సీక్వెల్ గురించిన ప్రస్తావన అల్లు అర్జున్ దగ్గర వస్తే, “అది చరణ్ చేయవలసిన సినిమా” అని ఓపెన్ గా చెప్పేశాడు. అయితే ఆ తరువాత ఈ సినిమా సీక్వెల్ ను సాయిధరమ్ తేజ్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. చిరూ స్టైల్ ను అనుకరించడం .. ఆయన సినిమాల్లోని సాంగ్స్ ను రీమిక్స్ చేయడం వలన తేజూనే ఈ సినిమా చేస్తాడని అనుకున్నారు.
కానీ అందులో నిజం లేదనే విషయం తాజాగా స్పష్టమైంది. ‘జవాన్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా సాయిధరమ్ తేజ్… ఫేస్ బుక్ లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించాడు. ” ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్లో చేస్తారా?” అనే ప్రశ్న ఓ అభిమాని నుంచి ఎదురైంది.” ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్ చేస్తే చరణ్ చేయాలి .. ఆయన చేస్తేనే బాగుంటుంది” అనే అభిప్రాయాన్ని తేజు సూటిగా వ్యక్తం చేశాడు. దాంతో ఈ సినిమా తేజు చేస్తాడంటూ జరుగుతోన్న ప్రచారానికి తెర పడింది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…