
క్రిష్ వివాహ వేడుకకు విచ్చేసిన రామ్ చరణ్ తేజ్ ఓ బ్లాక్ షర్టును ధరించి విచ్చేసాడు. ‘ధ్రువ’ సినిమా కోసం మేకోవర్ అయిన చెర్రీ, ఈ బ్లాక్ షర్టులో ఆకట్టుకునే లుక్ లో ఫ్యాన్స్ కు దర్శనమిచ్చాడు. అయితే ఇదే షర్టు ధరించి, దాదాపు ఒక వారం క్రిందట మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్ లో కనపడడం విశేషం. దీంతో వీరిద్దరి ఫోటోలను పక్కన పెట్టి, ‘సేమ్ పించ్’ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
తండ్రి కొడుకులిద్దరూ ఒకే షర్టుని ధరించడం కేవలం కాకతాళీయమేనా… లేక దీని వెనుక ఏమైనా బలమైన సెంటిమెంట్ ఉందో గానీ, గతంలో మహేష్ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకే రకమైన ‘బ్లాక్ అండ్ వైట్’ టీ షర్టుతో వివిధ సందర్భాలలో కనపడిన విషయం నెటిజన్లకు తెలిసిన విషయమే. అయినా ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది’ అన్నట్లు… సిరిసంపదలతో తూలతూగే ఈ సినీ కుటుంబాలు ఒకే రకమైన కాస్ట్యూమ్స్ ని ఫ్యామిలీ అంతా వినియోగించడంలో వింతేముందిలే..!
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…