
ఈ సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ బంధాన్ని బహిర్గతం చేసే రెండు ఫోటోలు విడుదల చేసింది. సరైన సందర్భంలో సరైన టాపిక్ తో ప్రొమోషన్స్ చెయ్యడం తో దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. #RRRYehDosti అనే హాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. అభిమానులు తమ స్నేహితులతో ఉన్న మధురస్మృతులు దీనితో పంచుకుంటున్నారు. రవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో అలియాభట్, అజయ్‌దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ కు జంటగా నటిస్తున్న భామ పేరును టీం ఇంకా ప్రకటించలేదు. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
Telangana politics are starting to heat up again as a social issue has come up…