
సాధారణంగా మణిరత్నం సినిమాలో హీరో అంటే ఎలాంటి రసాన్ని అయినా వెండితెర అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించే వ్యక్తి. మరో వైపు రామ్ చరణ్ అంటే కేవలం యాక్షన్ సినిమాలకు మాత్రమే సూట్ అయ్యే ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో దిట్ట. అలాగే కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, తానూ నమ్మిన కధను తెరకెక్కించే వ్యక్తి మణి అయితే, మాస్ అండ్ కమర్షియల్ అంశాలు లేకుండా చెర్రీ సినిమా అంటే ఊహించడం సాధ్యం కాని విషయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే… ప్రయోగాలకు పెద్ద పీట వేయడంలో మణిరత్నం సిద్ధహస్తుడైతే, ప్రయోగాలకు తావు లేకుండా చేయడంలో చెర్రీ ఆరితేరిన వారు.
దీంతో మణి-చెర్రీ జోడి అనగానే ఒక్కసారిగా సినీ ప్రియులు అవాక్కయ్యారు. అయితే సక్సెస్ లేకుండా సాగుతున్న వీరిద్దరూ ఒకరి అభిప్రాయాలు మరొకరు మార్చుకున్నారా? కమర్షియల్ సినిమా చేయాలనే భావానికి మణి వచ్చారా? లేక ఓ ప్రయోగం చేసి అందరి మనసులు కొల్లగొడదామని చెర్రీ అనుకుంటున్నారా? ఏమో… ప్రస్తుతానికి సదరు ఈ ట్వీట్ తో సదరు సినీ ప్రముఖుడు మెగా అభిమానులకు పెద్ద పజిలే వదిలారు.
A Class 10 student was critically injured after a man allegedly attacked her with an…
Chiranjeevi's upcoming Netflix show Megaverse could turn out to be more than just another celebrity…