
“పర్సనలైజ్డ్ మూవీ థియేటర్స్”ను ప్రతి పట్టణంలోనూ ప్రారంభించాలన్నది వీరి ఆలోచన. ఈ సినిమా థియేటర్స్ లో 70 నుంచి 100 అంగుళాల తెరలు, పూర్తి అత్యాధునిక సౌకర్యం, సౌండ్ సిస్టమ్ తో ఉంటాయని, ఇద్దరి నుంచి 10 లేదా 12 మంది వరకూ ఒకేసారి కలిసి కూర్చుని సినిమాను వీక్షించేలా ఇవి ఉంటాయని తెలుస్తోంది. 8 నుంచి 10 అడుగుల వెడల్పు, 10 నుంచి 12 అడుగుల పొడవుతో ఉండే మినీ థియేటర్స్ ను ఏర్పాటు చేయాలన్నది వీరిరువురూ కలసి ఆలోచిస్తున్నారనేది ఈ వార్తల సారాంశం.
ఇందుకు గానూ అటు కృష్ణంరాజు నుంచి, ఇటు చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్స్ కూడా లభించాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఓ కుటుంబమంతా కలసి సినిమాను థియేటర్ లో చూసిన అనుభూతిని పొందుతూ ఇక్కడ వీక్షించవచ్చని ఈ డీల్ గురించి తెలిసిన వ్యక్తుల సమాచారం. ఇప్పటికే ప్రభాస్, రాంచరణ్ మధ్య పర్సనల్, ప్రొఫెషనల్ స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి వ్యాపార భాగస్వామ్యంపై పూర్తి సమాచారం అధికారికంగా వెలువడాల్సి వుంది.
భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…