
తాజాగా రామ్ చరణ్ సెట్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను చిత్ర ప్రొడక్షన్ సంస్థ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కళా దర్శకుడు తోట తరణితో చెర్రీ ముచ్చట్లు చెప్తున్న ఫోటోలు మెగా అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. సింపుల్ లుక్ లో ఉన్న మెగా వారసుడు లెజెండరీ తోట తరణితో ఏం చెప్తున్నారో గానీ… చిరు నవ్వులు చిందిస్తున్న రామ్ చరణ్ ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రత్నవేలు, తోటతరణి వంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ‘చందమామ’ కాజల్ కనువిందు చేయబోతోంది. ఆగష్టు 22వ తేదీన చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులను అలరించేందుకు ఫస్ట్ పోస్టర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…