
రెండవ సినిమా ప్రారంభానికి దాదాపుగా ఏడాదిన్నర్ర సమయం తీసుకున్న అఖిల్, మూడవ సినిమాకు మాత్రం అంత సమయం తీసుకోవడం లేదని ‘ధృవ’ దర్శకుడు తెలిపాడు. ఇప్పటికే అర్ధమైయుంటుంది… ‘ధృవ’ దర్శకుడు అయిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే అక్కినేని అఖిల్ మూడవ సినిమా తెరకెక్కనుందని! అయితే ఈ సినిమాను నిర్మించబోయేది ఎవరో తెలిస్తే… మరోసారి అవాక్కవ్వక మానరు.
‘ఖైదీ నంబర్ 150’ ద్వారా తొలిసారిగా నిర్మాతగా మారిన రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’లోనే అఖిల్ మూడవ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా సురేందర్ రెడ్డి తన ‘ధృవ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెలవిచ్చారు. దీంతో అఖిల్ మొదటి సినిమా కోసం హీరో నితిన్ ముందుకు రాగా, మూడవ సినిమా కోసం ఏకంగా మెగా వారసుడు రామ్ చరణ్ సీన్ లోకి రావడాన్ని సినీ జనాలు విశేషంగా చెప్పుకుంటున్నారు.
గోదావరి జిల్లాలలో ‘పోలవరం పూర్తికాదు.. ఈ పిల్లకి పెళ్ళి కాదు’ అనే నానుడి వినిపిస్తుంటుంది. నాలుగు దశాబ్దాల పాటు నిర్మాణం…
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…