
ఈ నేపథ్యంలో సదరు కథనాలపై స్పందించిన సన్నిహితులు ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం రాందేవ్ బాబా హరిద్వార్‌లో నిక్షేపంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు సృష్టించారని, ఈ వార్తలను నమ్మకూడదని చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానంటూ రాందేవ్ బాబా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే స్ట్రెచర్ మీద ఉన్న రాందేవ్ బాబాను చూసినపుడే ఇవి పుకార్లని చెప్పేయవచ్చు.
భారీ యాక్సిడెంట్ అయ్యిందని చెప్తున్నా, బాబా ముఖంపై చిన్న ఘాటు కూడా పడకపోవడం, ఈ పుకార్లను సృష్టించిన వారు ఆలోచించలేదేమో..! ఇటీవల కాలంలో అనేక సినీ సెలబ్రిటీలను సోషల్ మీడియా వేదికగా చంపేస్తున్న తరుణంలో… తాజాగా రాందేవ్ బాబా వంతు వచ్చినట్లుంది. అయితే అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో గానీ, ఏమి ఆలోచించకుండా షేర్లు చేసే వారు మాత్రం కాస్త ఆలోచించాలని కోరడం సన్నిహితుల వంతవుతోంది.
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…