
“నాకు వైసీపీ పరిపాలన నచ్చలేదని ఓటు వేసిన వ్యక్తి అంటే మీరు వెంటనే దిగిపోతారా? లేదంటే ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి దొబ్బి తిని, నాకు టేస్ట్ నచ్చలేదు, బిల్లు కట్టను అంటే కరెక్టా అది” అంటూ పేర్ని నాని వ్యాఖ్యలకు బదులుగా వర్మ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలాగే ‘గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి’ అంటూ ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను కూడా సంధించారు.
సినిమాలతో సహా ఇతర ఉత్పత్తులపై ధరలను నిర్ణయించేటపుడు ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటో చెప్పాను, మీరు లేక మీ ప్రతినిధులు నా ప్రశ్నలకు జవాబు చెప్పండి. ఫుడ్ గ్రైన్స్ యొక్క ధరలను తగ్గించడం అనేది నాణ్యతను తగ్గించడానికి కారణమవుతుందని బేసిక్ ఎకానమీ థియరీ చెప్తుందని, సినిమాలకు ఇదే వర్తిస్తుందని అన్నారు.
ఒకవేళ పేదవాళ్లకు సినిమానే ప్రధానం అని మీరనుకుంటే మెడికల్ మరియు విద్యలలో ఇస్తోన్న సబ్సిడీలను ప్రభుత్వం సమకూర్చవచ్చు కదా? అలాగే బియ్యం, చక్కర తదితర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందిస్తోన్న ప్రభుత్వం రేషన్ ధియేటర్లను కూడా సృష్టించవచ్చు కదా? అలా కాకుండా ఇందులో రెండు విధానాలను కూడా ప్రవేశపెట్టవచ్చని వివరించారు.
ఒకటి నిర్మాత తనకు కావాల్సిన ధరకు టికెట్ అమ్ముకుంటే, దానిని ప్రభుత్వం కొనుగోలు చేసి పేద వారికి తక్కువ ధరలో ఇవ్వొచ్చు, మీ ఓట్లు మీకు వస్తాయి అంటూ స్పందించారు. ఇలా పేర్ని నానిని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్లతో పాటు ఈ అంశంపై ఇండస్ట్రీ వ్యక్తులు మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నానని, ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు, తర్వాత మీ కర్మ అంటూ పిలుపునిచ్చారు.
ఒకప్పుడు వైసీపీ అండదండలుగా ఉన్న రాంగోపాల్ వర్మ, తాజాగా జరుగుతోన్న టికెట్ వివాదంలో మాత్రం వైసీపీ మంత్రిని టార్గెట్ చేయడమే కాకుండా, ఏకంగా పరిపాలన నుండి దిగిపోతారా? అంటూ ప్రశ్నించడం విశేషం. బహుశా రాజకీయాలకు అతీతంగా ఈ ఉదంతంపై వర్మ పెదవి విప్పుతున్నారో లేక ఇందులో కూడా నిగూఢ రాజకీయం దాగి ఉందో గానీ వర్మ వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…