
జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా చానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పాడు. పలు మీడియా సంస్థలు అసత్యపు ప్రచారాన్ని చేశాయని మండిపడ్డాడు. సినిమా తెరకెక్కించిన ఘనతే తనదని అన్నాడు. తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు.
సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశాడు వర్మ. కాగా, ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ), ఆపై మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలపై గత శనివారం వర్మను సీసీఎస్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…
Kollywood film Anbe Diana starring Pari Elavazhagan in the lead and directed by him, was…