
“ఆ నెంబర్ చెప్తే మీరు గుండె ఆగి చచ్చిపోతారు, నా సామాజిక బాధ్యత క్రింద వాటిని చెప్పడం లేదు” అని వర్మ కౌంటర్ తో కూడిన ఎస్కేప్ రిప్లై ఇచ్చారు. ఒక మహిళను న్యూడ్ గా చూపించడాన్ని ప్రస్తావిస్తూ… మీకు సామాజిక బాధ్యత లేదా… అంటూ వర్మను ప్రశ్నించగా, దానికి కౌంటర్ గా దీనికి సామాజిక బాధ్యత ఉందంటూ వెల్లడించాడు. వర్మ చెప్పడానికే వెనుకడుగు వేసారంటే… ఆ సంఖ్య బహుశా ఎవరి ఊహలకు కూడా అందకపొవచ్చేమో! ఇదంతా తాజాగా వర్మను ఓ మీడియా ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో భాగం.
‘పోర్న్ స్టార్’ కావాలనేది ఎవరిష్టం వారిదని, తన కూతురినైనా తాను అభ్యంతరం చెప్పబోనని తెగేసి చెప్పారు వర్మ. అలాగే సన్నీలియోన్ లా అందరూ మహిళలు సుఖాన్ని ఇవ్వాలని తాను చేసిన ట్వీట్ కు కట్టుబడి ఉన్నానని, అమ్మాయిలను న్యూడ్ గా చూడడం నా ఇష్టం, అది నా అభిప్రాయం అని, అలా ఉంటే బాగుంటుందనేది తన భావన చెప్పానే తప్ప, అలా ఉండమని ఏ ఒక్కరిని తాను ఆదేశించలేదు, డిమాండ్ చేయలేదని తనదైన లాజిక్ తో మ్యాజిక్ డైలాగ్స్ వేసాడు వర్మ.
Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…
Andhra Pradesh chief minister, Chandrababu Naidu has been fully committed and dedicated towards the completion…