
వర్మ పడేయడానికి ట్రై చేసినా కూడా పడని అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? అంటే… అసలు నేను ట్రై చేయను… నాకు కావాలి… ఇస్తావా… ఇవ్వవా… అని అడుగుతానే తప్ప ట్రై చేస్తూ సమయం వృధా చేసుకోనని స్పష్టంగా పూసగుచ్చినట్లుగా చెప్పారు. అసలింత సమయం మీకు ఎక్కడుంటుంది? అంటే ‘అసలు టైం ఉందే దాని కోసం’ నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు ‘నో’ చెప్పిన అమ్మాయిలు ఉన్నారని, 10 మందిలో 9 మంది ‘నో’ అనే చెప్తారని, అయితే తానూ 100 మందిని అడుగుతానని చెప్పారు.
అయితే ఈ 100 మందిని జీవిత కాలం అడగనని, బహుశా ఒక నెలలో 100 మందిని అడిగితే 90 మంది నో అనే చెప్తారని, ఇక మిగతా మీరే వేసుకోండి… అంటూ వర్మ సమాధానం ఇచ్చారు. “గన్స్ అండ్ థైస్” సినిమా ట్రైలర్ తన కూతురుకు బాగా నచ్చిందని మెస్సేజ్ ఇచ్చిందని చెప్పిన వర్మ, ఇదే సినిమాను మీ కూతురితో కలిసి చూస్తారా? అంటే మాత్రం కాస్త తటపటాయించారు. అయితే ఎవరితో అయినా తన బావ వ్యక్తీకరణ ఇలాగే ఉంటుందని, పబ్లిక్ లైఫ్ లోనే చెప్పినపుడు, ఇతర వ్యక్తులతో ఎందుకు చెప్పకుండా ఉంటానని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసారు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…