
ఒక చిన్న రూమ్ లో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణే ఈ “మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తి హై” షార్ట్ మూవీ. ఒక మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన ఒక అమ్మాయి, తన కెరీర్ గా ‘పోర్న్’ను ఎంచుకుని, ‘పోర్న్ స్టార్’ కావాలనుకుంటున్నానని తన తల్లితండ్రులతో చెప్తుంది. ఒక్కసారిగా షాక్ తిన్న వారు, ఆమెతో విభేదించడం, వారిని కన్విన్స్ చేయాలని కూతురు ప్రయత్నించడమే ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. ఓ మహిళ తన అభిరుచులకు అనుగుణంగా కెరీర్ ఎంచుకోవాలన్న సిద్ధాంతాన్ని… ఓ చిన్నపాటి సందేశాన్ని… ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా వర్మ చెప్పారు… అది పోర్న్ అయినా కూడా..!
అయితే ప్రాక్టికల్ గా ఇది సమాజానికి చాలా దూరంగా ఉండే సిద్ధాంతాన్ని వర్మ తనదైన శైలిలో చూపించారు. ఇంత పచ్చిగా ఏ కూతురు కూడా ఏ తల్లితండ్రుల దగ్గర మాట్లాడదు. అలా జరగడానికి కూడా ఆస్కారం లేదు. బహుశా ‘పోర్న్ స్టార్’గా రాజ్యమేలుతున్న సన్నీలియోన్ కూడా వారి తల్లితండ్రులతో ఈ విధమైన వాగ్వివాదం చేసి ఉండకపోవచ్చు. కానీ వర్మ శైలి ఇదే కాబట్టి, ఇందులో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ షార్ట్ ఫిల్మ్ లో హైలైట్ ఏమైనా ఉంది అంటే… అది నైనా గంగూలీ రూపమే..! వర్మ కూడా అందుకే తీసినట్టున్నారు..!
A roulette wheel, a casino floor and a group of young people looking for a…
రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంబ కంచుకోటగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న పులివెందులలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ…