
జయలలిత, శశకళల మధ్య ఉన్న బంధంలో ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమాలో చూపిస్తానని ఇది వరకే తెలిపిన వర్మ, తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య జరుగుతున్న రాజకీయ నాటకంతో సమాధిలో ఉన్న జయ ఆత్మ శాంతిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ నాటకీయ పరిణామాలను తట్టుకోలేకపోయిన జయలలిత ఆత్మ… సమాధిలో నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ గా ఉంటుందని అన్నారు.
మరోవైపు పరప్పణ అగ్రహార జైల్లో అధికారులతో శశికళ వాదిస్తూ… తానేమైనా చిల్లర దొంగనా? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా వర్మ స్పందిస్తూ… తాను చిల్లర దొంగను కాదు అని శశికళ అనడాన్ని చిల్లర దొంగలు, జేబు దొంగలు స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు. “అసలైన నేరం ఎవరిది? బతకడం కోసం 600 దొంగతనం చేసిన వారిదా? లేక తమ విలాసవంతమైన జీవితం కోసం… తమపై ఎంతో నమ్మకముంచిన ప్రజలను మోసం చేసి… 60 కోట్లు కొట్టేసిన దొంగలదా?” అని తనదైన శైలిలో ప్రశ్నించారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…