Telugu

పేర్ని నాని… మీకు, మీ డ్రైవర్ కి తేడా లేదా?

ట్విట్టర్ వేదికగా సాగుతోన్న ఆర్జీవీ vs పేర్ని నాని ఎపిసోడ్ రసవత్తరంగా మారుతోంది. తాజాగా ఆర్జీవీ వేసిన ప్రశ్నలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. రెమ్యూనరేషన్ విషయంలో పేర్ని నాని వేసిన ట్వీట్ కు బదులుగా వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

“నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?” అంటూ సూటిగా నిలదీశారు వర్మ. వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన ఉదంతం ఏమిటో చూద్దాం…

పేర్ని నాని : గౌరవనీయులైన రాంగోపాల్ వర్మ గారూ… మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?

వర్మ : థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.

నీళ్ళు లేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారు తప్పని అడ్డుకట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం. ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యువస్ గా అన్ని ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం. బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.

కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం.బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్. ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది? ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై.

గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్య0 గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ?

పేర్ని నాని : సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.

వర్మ : సారీ నాని గారు లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు… అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు… ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది.

పేర్ని నాని : ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.

వర్మ : థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ డెఫినిషన్ ఉందా. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు.

థియేటర్లనేవి , జూన్ 19 1905 న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికా లో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు..కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి

పేర్ని నాని : బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.

వర్మ : సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే.

పేర్ని నాని : సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే… మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు.

వర్మ : రేట్ లు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని ఎందుకంటే సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నాము అని చెప్పింది మీ నాయకులే.. అది కానప్పుడు అసలు ఈ డిస్కషన్ ఎందుకు ఇష్యూ లేనప్పుడు?

పేర్ని నాని : థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.

వర్మ : 100% కరెక్ట్. అలాంటప్పుడు V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు?ఈ కింది ట్వీట్ లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే. వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు, వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు.

పేర్ని నాని : హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు.

వర్మ : నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?

పేర్ని నాని : మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?

వర్మ : పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు..కానీ దాని కోసం పేదలను ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న ధనికుల్ని పేదల్ని చెయ్యకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.

చివరిగా నాని గారు మీ పార్టీ లో కొందరు మిగతా లీడర్ల లాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీ తో సామరస్యం పాటించినందుకు ఇంకోక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది.

నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ను, ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ తెలియదు. కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వం లో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి ఏర్పడ్డ మిస్ అండర్ స్టాండింగ్ తొలగిపోవడానికి అవసరం. థ్యాంక్యూ! అంటూ ముగించారు వర్మ.

ఈ మొత్తం ఉదంతం గమనిస్తే… ఇద్దరు కూడా ‘గారు’ అంటూ సంభాషించుకోవడం విశేషం. ముఖ్యంగా తమపై వస్తోన్న విమర్శలకు బూతులతోనే సమాధానం ఇచ్చే వైసీపీ నేతలు వర్మపై ఇంతవరకు ఒక్క అసభ్యకరమైన కామెంట్ కూడా చేయకపోవడం విశేషం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana Is A Story That Lives Within Us: Ranbir

The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…

1 hour ago

Bloody Romeo: Sujeeth’s Presentation of Nani Most Crucial

Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…

2 hours ago