
ఈ సందర్భంగా రాజమౌళి కి ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు. ఇండియా లో జోకర్ ఇంత పెద్ద హిట్ అయితే, కే ఏ పాల్ జీవిత చరిత్ర మీద రాజమౌళి సినిమా తీస్తే అది బాహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుంది. ఇప్పటికే రాజమౌళి పాల్ తో అమెరికాలో చర్చలు జరుపుతున్నాడట. ఈ విషయం నాకు పాల్ స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించేసారు వర్మ.
దానికి నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు రాజు గారు అంటూ రిప్లై ఇచ్చాడు రాజమౌళి. రాజు గారు అన్న పదాన్ని కోట్ చెయ్యడంతో కులాల ప్రస్తావన తెచ్చినట్టు అయ్యింది. రామ్ గోపాల్ వర్మ రాజుల కులానికి చెందిన వారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని రాజమౌళి జోక్ గా ప్రస్తావించారు. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.
ఈ చిత్రం జులై 30, 2020న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం.
Prabhas is celebrating his birthday, and fans have found yet another reason to celebrate the…
ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో కనిపిస్తోంది. ఇంతవరకు జరిగిన, ఇంకా…