
తనకు బాగా ఇష్టమైన ‘పోర్న్’ను మరియు ‘పవన్ కళ్యాణ్’ను కలిపి ఈ ‘పోర్న్ కళ్యాణ్’ అనే పదాన్ని రూపొందించారు వర్మ. ఇదే తనకు అసలు ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అంటూ అభివర్ణించారు. ‘పోర్న్’కు, పవన్ కు ఉన్న పాపులారిటీ రీత్యా, ‘పోర్న్ కళ్యాణ్’ అనేది అల్టిమేట్ బ్రాండ్ అని, తనకు వ్యక్తిగతంగా ‘పోర్న్ మరియు పవన్ కళ్యాణ్ ను సమాన దృష్టితో చూస్తానని ట్విట్టర్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మపై విరుచుకుపడుతున్నారు. ‘పోర్న్ కళ్యాణ్’ హాష్ ట్యాగ్ తోజరుగుతున్న ఈ సంభాషణలలో కత్తి మహేష్ కూడా ఎంటర్ అయ్యి, మరింత వేడిని రాజేశారు. ‘పోర్న్ కళ్యాణ్’ అనేది బాగా సౌండింగ్ ఇస్తోందని అన్న కత్తి, అతను కూడా ఖచ్చితంగా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు… అంటూ రిప్లై ఇవ్వడంతో, పవన్ ఫ్యాన్స్ కు, కత్తికి మధ్య మరోసారి యుద్ధం జరుగుతోంది.
సమయం, సందర్భం లేకుండా వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. సీసీఎస్ పోలీసుల ఎదుట తాను ఎదుర్కొన్న విచారణలో జరిగిన విషయాలు మీడియాలో వరుసగా ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ విచారణలో వర్మ చాలా డిఫెన్స్ లో సమాధానాలు చెప్పారని తేలడంతో, ప్రేక్షకుల, మీడియా దృష్టిని మళ్ళీ తన వైపుకు తిప్పుకోవడానికి వేసిన బాణంలో భాగంగా ఈ ‘పోర్న్ కళ్యాణ్’ పుట్టుకొచ్చింది.
తమ అభిమాన హీరోను ఆ విధంగా సంభాషించడం ఏ అభిమానులు సహించలేరు. దీంతో సహజంగానే పవన్ ఫ్యాన్స్ వర్మ, కత్తి మహేష్ లపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే… వారికి కావాల్సింది కూడా ఇదే! కానీ సంయమనం పాటించి, ఇలాంటి వాటికి అభిమానులు ప్రాధాన్యత లేకుండా విస్మరిస్తే… మరోసారి ఇలాంటి ట్వీట్లు వారి నుండి రావని గమనించాలి.
Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…
Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…