
‘బాహుబలి 2’ను వీలైనన్ని ఎక్కువ సార్లు చూడడానికి ‘కాటమరాయుడు’ సినిమాను చూడట్లేదని, ‘బాహుబలి 2’ కోసం సదరు హీరో అభిమానులు కూడా డబ్బులు దాచుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వర్మ ఓ ట్వీట్ చేసారు. వర్మ చేసిన ట్వీట్ కాస్త ఎటకారాన్ని తలపిస్తుంది గానీ, ఇందులో ఉన్న ‘సిద్ధాంతం’ మాత్రం కాస్త ఆలోచించదగినదే. ‘బాహుబలి 2’ ట్రైలర్ విడుదలైన తర్వాత సినీ ప్రేక్షకులు మరో సినిమా గురించి ఆలోచించే ధోరణిలో లేరన్నది ఇటీవల చాలామంది నోట నుండి వింటున్న విషయం.
‘బాహుబలి 2’ ఫలితం ఎలా ఉన్నా, ఆ సినిమాను ఒక్కసారైనా చూసేయాలన్న భావనతో సినీ అభిమానులు ఉన్నారు. ఈ ప్రభావం ‘కాటమరాయుడు’ సినిమాపై పడిందన్నది ఫస్ట్ డేనే వచ్చిన టాక్. రెగ్యులర్ మాస్ సినిమాగా తెరకెక్కిన రాయుడును వీక్షించేందుకు పెద్దగా ఆసక్తి లేదన్నది ఓపెన్ టాక్. ఆ ప్రభావమే రెండో రోజు నుండి ధియేటర్ల వద్ద కనపడింది. నిజానికి పవన్ సినిమాకు ‘యావరేజ్’ టాక్ వస్తే, బాక్సాఫీస్ కళకళలాడాలి. కానీ, పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడంతో, వర్మ చెప్పిన సిద్ధాంతానికి మద్దతు లభిస్తోంది.
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…