
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే… అక్కడ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచేసే అవకాశాలు పెద్దగా రావడం లేదు. దానితో వివాదాస్పద విషయాలలో ప్రభుత్వానికి నొప్పి కలిగించకుండా సైలెంట్ ఐపోతున్నారు. రాజధాని మార్పు వంటి తరాలను ప్రభావితం చేసే విషయం పై కూడా ఇప్పటిదాకా మనకెందుకులే అన్నట్టు వదిలేశారు. ప్రభుత్వంతో కయ్యం దేనికి అనుకున్నారో ఏమో.
చిరంజీవి వంటి వారైతే పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేశారు. ఇక హీరో రామ్ కాసేపటి క్రితం ఉన్నఫళంగా ఇటీవలే విజయవాడలో జరిగిన హోటల్ స్వర్ణా ప్యాలస్ అగ్ని ప్రమాదం పై స్పందించారు. ఈ ఉదంతలో రమేష్ హాస్పిటల్స్ ను అనవసరంగా ఇరికిస్తున్నారని, ముఖ్యమంత్రి చుట్టూ ఉండేవారే ఆయనను తప్పుదోవ పట్టించి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
గతంలో లేని విధంగా రామ్ కు సడన్ గా ఎందుకు ఇంత సామాజిక స్పృహ వచ్చేసింది అని అంతా అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే… సదరు రమేష్ హాస్పిటల్స్ అధిపతులు రామ్ కు చుట్టాలు అవుతారట. అందుకే ఈ స్పెషల్ ఇంటరెస్ట్. తమదాకా వస్తే గానీ టాలీవుడ్ సెలబ్రిటీలకు నొప్పి తెలియదా? అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు.
Vishwak Sen is heading into an unusual phase of his career. Not because he has…
Avengers Endgame is proving that a film does not always need a new release to…