Telugu

ఆ సినిమా రాజమౌళి వల్ల ఆడలేదు!

తన సినిమాలకు ఇంట్లోనే మంచి విమర్శకులు ఉన్నారని దర్శకధీరుడు రాజమౌళి చెప్తుంటారు. తాజాగా రమా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘బాహుబలి’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా బాధ్యతలు చేపట్టిన రమా, ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ‘యమదొంగ’ సినిమా తనకు నచ్చలేదని, అయినా ఆ సినిమా బాగానే ఆడిందని, అయితే ఆ క్రెడిట్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కే దక్కుతుందని, ఆయన వల్లే ఆడిందని చెప్పుకొచ్చారు.

ఇక, ‘బాహుబలి’ సినిమాకు వస్తే… సక్సెస్ అవుతుందని భావించాను గానీ, ఇంత సక్సెస్ అవుతుందని మాత్రం ఊహించలేదని, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ‘బహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు?’ అన్న ప్రశ్నే ఎదురవుతోందని, అయితే ఇటీవల ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తూ ‘ఇదే కదా’ అని అడుగుతున్నారని చెప్పిన రమా రాజమౌళి, అలా విన్న కధలలో ఓ కధ మాత్రం తనకు బాగా నచ్చిందని అన్నారు. తనను చంపాల్సిందిగా కట్టప్పను బాహుబలినే ఆదేశిస్తారని చెప్పిన కధ తనకు బాగా నచ్చిందని, అయితే ఇది నిజమో కాదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.

ADVERTISEMENT

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీరవాణి పాడిన పాటకు ఒక్క రాజమౌళినే కాదని, తాను కూడా బాగా ఏమోషనల్ అయ్యాయని, ఆ సమయంలో తలెత్తి పైకి చూడలేకపోయానని, వేదికపై మా అత్తమ్మ ఫోటో ఉందన్న విషయం కూడా కనపడలేని విధంగా అయిపోయాయని, తర్వాత యూ ట్యూబ్ లో మళ్ళీ కీరవాణి పాట పాడిన సమయంలో తన అత్తమ్మ ఫోటో ఉండడాన్ని గమనించానని అన్నారు. కీరవాణి చేసిన వివాదాస్పద ట్వీట్లపై స్పందిస్తూ… తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు కీరవాణికి ఉందని తాను భావిస్తున్నానని, కీరవాణి చేసిన ట్వీట్లను సమర్ధించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi Is Finally Ready to Break Its Silence

Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…

37 minutes ago

Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?

After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…

1 hour ago