
‘మదర్’ సినిమా పేరుతో ఉన్న ఈ ఫోటోను ఎవరు చెక్కారో గానీ… జయలలిత ఫోటోతో రమ్యకృష్ణ ఫేస్ ను బాగా మార్ఫింగ్ చేసారన్న అనుమానం రాకుండా బాగా చెక్కారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారైతే నిజంగా రమ్యకృష్ణ ఈ పాత్ర పోషిస్తుందేమో అని నమ్మే విధంగా ఈ ఫోటోను అందంగా అలంకరించారు. సినిమా టైటిల్స్ ఏమో ‘బాహుబలి’ నుండి కాపీ కొట్టినట్లు కనపడుతోంది.
అయితే ఎంత మార్ఫింగ్ ఫోటో అయినా గానీ, జయలలిత పాత్రతో సినిమాను చేయాలనుకునే వారికి రమ్యకృష్ణ మొదటి ఛాయిస్ అన్న విధంగా ఈ ఫోటో స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే… ఎలాగైనా రమ్యకృష్ణను ఈ పాత్ర చేయాల్సిందిగా ఒప్పుకునేలా ఈ ఫోటోను డిజైన్ చేసారు. ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగలిగే అతి తక్కువ మంది హీరోయిన్లలో రమ్యకృష్ణ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు కదా!
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…