
దీంతో ఓ బొమ్మ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొడుతుందోనని ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు. తన సినిమాలతో పాటు విడుదల కాబోతున్న నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు కూడా విజయవంతం కావాలని, అంతిమంగా ‘సినిమా’ గెలవాలని రానా చేసిన ట్వీట్ కు రకుల్ మరియు నితిన్ లు స్పందించారు. రానాకు థాంక్స్ చెప్పిన రకుల్, “నీకు కూడా ఆల్ ది బెస్ట్, నాకు తెలుసు ఇది గేమ్ చేంజర్” అంటూ రిప్లై ఇచ్చింది. మరికాసేపటికి నితిన్ కూడా “రానాకు థాంక్స్ చెప్తూ… మనందరి సినిమాలు విజయవంతం కావాలని” ట్వీట్ చేసారు.
ఈ ముగ్గురి సెలబ్రిటీల మధ్య జరిగిన ఈ సరదా ట్వీట్ల సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్న ఈ ముగ్గురు ఆహ్లాదకరమైన అనుభూతులను పంచుకోవడం అనేది సినీ ప్రేక్షకులలో పాజిటివ్ సంకేతాలను పంపించినట్లయ్యింది. రానా అన్నట్లు… ఈ మూడు సినిమాలు హిట్టయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పండగే కదా! సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలు మూడు హిట్ కావడంతో, అదే సీన్ రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నాడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి శ్రీకారం చుట్టి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్ ఆయనను…
The Congress party is historically famous for leading group politics. There is very little dirty…