
ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కుల ధరలు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రదర్శితం అవుతోన్న సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ సరిగ్గా రాకపోతుండడంతో, శాటిలైట్ హక్కులకు క్రేజ్ కాస్త తగ్గింది. ఇలాంటి పరిస్థితులలోనూ చెర్రీ – సుకుమార్ ల “రంగస్థలం 1985” ఏకంగా 16 కోట్లకు ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్ దక్కించుకుందని, ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం.
ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలవనుంది. అంతేకాదు, ఇటీవల కాలంలో చాలా పెద్ద చిత్రాలు కూడా ఈ స్థాయి మొత్తాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. బుల్లితెర హక్కులే ఈ రేంజ్ లో ఉంటే, మరి ధియేటిరికల్ హక్కుల ధరలు ఏ స్థాయికి వెళ్తాయో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాలలో నెలకొంది. అయితే ఇదంతా కూడా ఒక్క టైటిల్ లోగోనే చేస్తోంది… ఇంకా టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో..!
Mahi Gaur brings an intoxicating wave of monsoon magic to the fashion spotlight with an…
418, the Telugu horror-thriller presented by Prashanth Neel, was supposed to release on July 31,…