
లాంగ్ రన్ లో టాలీవుడ్ టాప్ 5లో చోటు సంపాదించేలా కనపడుతోన్న ఈ సినిమా ‘శ్రీమంతుడు’ రికార్డులను బద్దలు చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎక్కడ ఎలా ఉన్నా… ప్రస్తుత ‘రంగస్థలం’ దూకుడు చూస్తుంటే… ఓవర్సీస్ లో ‘శ్రీమంతుడు’ రికార్డులు బద్దలు కావడం ఖాయంలా కనపడుతోంది. ఓవర్సీస్ లో ‘నాన్ బహుబలి’ రికార్డు ప్రిన్స్ ‘శ్రీమంతుడు’ పేరిట 2.89 మిలియన్ డాలర్స్ తో సుస్థిరంగా ఉంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం మరో విశేషం.
ఇక ప్రీమియర్స్ మరియు తొలి రోజున ‘రంగస్థలం’ వసూళ్లు 1 మిలియన్స్ పైగా వసూలు చేయగా, రెండవ రోజు కూడా స్ట్రాంగ్ గా దూసుకెళ్తూ 1.5 మిలియన్ డాలర్స్ ను టచ్ చేసింది. ఆదివారం నాటికి ఖచ్చితంగా 2 మిలియన్ డాలర్స్ ను పూర్తి చేయనున్న ‘రంగస్థలం’ 3 మిలియన్ డాలర్స్ ను అందుకుంటుందా? లేదా? అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న. ఈ రేంజ్ ఓపెనింగ్స్ కు సుకుమార్ కారణం కాగా, ‘చరణ్ అండ్ కో’ వారి వారి నటనతో మెస్మరైజ్ చేయడం, పాజిటివ్ రివ్యూలు రావడంతో, ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులకు ‘రంగస్థలం’ వేదిక అవుతోంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…