Telugu

ఈయనేమి హీరో… ఫ్యాన్స్ ను ఘోరంగా అవమానించాడు..!

సినీ హీరోల కోసం అభిమానులు ఏం చేసేందుకైనా వెనుకాడరు. కొందరు అభిమానులైతే చుట్టూ ఉన్న పరిస్థితులు, విచక్షణ మరిచి మరీ వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారిని కొంటె చేష్టల పేరిట రణ్ వీర్ సింగ్ దారుణంగా అవమానించాడు. ఆ సమయంలో అందరూ ఎంజాయ్ చేయడంతో ఆయన సరదాగా చేశాడని, దానిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని అభిమానుల ఉవాచ.

ADVERTISEMENT

ముంబై శివార్లలో ఓ షాపు ఓపెనింగ్ కు బాలీవుడ్ యువ హీరో రణ్ వీర్ సింగ్ వెళ్లాడు. దీంతో ఆ ప్రాంతం అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. ఈ సందర్భంగా రణ్ వీర్ సింగ్ తన అభిమానుల్లో తనపై ఉండే ప్రేమను పరీక్షించాలని భావించాడు. దీంతో తన వీరాభిమానులు ఎవరని అడిగాడు. ముందుకు వచ్చిన వారిని తన కోసం ఏం చేస్తారని ప్రశ్నించాడు. దీంతో అతని కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని వారు తెలిపారు. అయితే ఇప్పటికిప్పుడు ప్యాంట్లు విప్పండని ఆదేశించాడు. పది మందిలో ఉన్నామన్న విక్షణ లేకుండా, అభిమానానికి ప్యాంట్లు విప్పడానికి సంబంధం ఏంటని కూడా అడగకుండా వారు ప్యాంట్లు విప్పి అతనిపై అభిమానం చూపించారు.

దీనినంతటినీ అక్కడున్న మీడియా ప్రతినిధులు, ఇతరులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అనంతరం రణ్ వీర్ సింగ్ ను షర్టు విప్పాలని అభిమానులు కోరడంతో, ఉదయం బ్రేక్ ఫాస్ట్ బాగా తినేశానని, షేప్ బాగోదంటూ రణ్ వీర్ సింగ్ తప్పించుకున్నాడు. అయితే అభిమానులు ప్యాంట్లు విప్పిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు దీనిపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలా ఆడుకోవడమేంటని, అయినా అభిమానాన్ని పరీక్షించేందుకు ప్యాంట్లు విప్పడం కొలమానమా? అంటూ మండిపడుతున్నారు. అయితే ఇది ఒక చిలిపి పని మాత్రమే అని హీరోను సమర్ధించే వారూ లేకపోలేరు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

5 hours ago

Allari Naresh: Nervous But Happy With The Response

For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…

5 hours ago