Telugu

సోషల్ మీడియాలో హోరు.. థియేటర్లలో బేజారు

“రావు బహదూర్” కచ్చితంగా మంచి సినిమానే. మంచి సోషల్ సెటైర్ తోపాటు మనిషిలోని ఆధిపత్య ధోరణిని ఎండగట్టిన సినిమా. అయితే.. ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా మాత్రం కాదు అనేది నిస్సందేహంగా ఒప్పుకోవాల్సిన విషయం.

కాకపోతే.. ఈ విషయాన్ని “రావు బహదూర్” టీమ్ ఒప్పుకోవడం లేదు. ఇది అందరూ చూడాల్సిన సినిమా అని నమ్మించే ప్రయత్నం కాస్త గట్టిగానే చేస్తున్నారు.

ADVERTISEMENT

ముఖ్యంగా సోషల్ మీడియా మొత్తం ఊదరగొట్టేస్తున్నారు. ఇదో కల్ట్ సినిమా అని, వెంకటేష్ మహా ఇన్నేసి గొప్ప విషయాలు తన సినిమా ద్వారా చెప్పాడని రకరకాల థియరీలు రాస్తున్నారు.

ఒక సినిమాని ప్రేక్షకులు ఓన్ చేసుకొని.. తమకు నచ్చిన విషయాల గురించి చెబుతూ గొప్పగా పోస్టులు పెట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ “రావు బహదూర్” విషయంలో సదరు పోస్టులు ఆర్గానిక్ గా కనిపించడం లేదు.

చాయ్ బిస్కెట్ టీమ్ సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఎంత స్ట్రాంగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం “రావు బహదూర్” సినిమా థియరీలు వైరల్ అవ్వడం లేదా హోరెత్తడం అనేది పెద్ద విషయమేమీ కాదు.

కానీ.. ఆ సోషల్ మీడియా హోరు థియేటర్ల దగ్గర జోరుగా మాత్రం మారడం లేదు. అసలు ఈ సినిమా ఆడాల్సిన మల్టీప్లెక్సుల్లోనూ కనీస స్థాయి టికెట్లు తెగడం లేదు. బిజినెస్ పరంగా మూవీ టీమ్ ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ.. థియేటర్లలో సరైన ఆదరణ చూరగొనడం లేదు అనేది వాస్తవం.

మరి ఈ డిస్కనెక్ట్ ఎక్కడ జరిగింది? వెంకటేష్ మహా దర్శకత్వ ప్రతిభ, సత్యదేవ్ నట విశ్వరూపం ప్రేక్షకుల్ని థియేటర్లకు ఎందుకు రప్పించలేకపోయాయి? అనేది చిత్రబృందం కాస్త త్వరగా రియలైజ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Kaaka Is Official, Vishwambhara Is Still A Mystery

Chiranjeevi’s Sankranthi 2027 plans have taken a clear turn. Kaaka has officially locked January 13,…

17 minutes ago

Old Video, Fresh Fire: Ranbir Gets Trolled Again

An old video of Ranbir Kapoor refusing Ganesh prasad has resurfaced, and it has now…

33 minutes ago