
ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా స్టార్ హీరోలతో పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అమితాబ్ బచన్ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ రావడం విశేషం. ఇక మొన్న వచ్చిన పుష్పతో ఆమె పాన్ ఇండియా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆమెకు బాలీవుడ్లో ఆఫర్లు బాగానే పెరుగుతున్నాయి. అయితే రష్మిక కు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించిన వార్త వచ్చినప్పుడల్లా విజయ్ దేవరకొండ పేరు తెరమీదికి వస్తూనే ఉంది.
వీరిద్దరూ కలిసి ఇంతకు ముందు రెండు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కూడా నిత్యం ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండడంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా మొన్న ఓ నెటిజన్ విజయ్, రష్మిక పెళ్లి అంటూ చేసిన పోస్టుకు విజయ్ ఘాటైన రిప్లై ఇచ్చాడు. నాన్సెన్స్ అంటూ ఏకిపారేశాడు.
ఇక తాజాగా రష్మిక కూడా ఈ వార్తలపై స్పందించినది. ప్రస్తుతం ఆడాళ్లు మీకు జోహార్లు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మిక కు ఈ ప్రశ్న ఎదురైంది. తన పెళ్లికి ఇంకా సమయం ఉందని ఇప్పుడే చేసుకోబోనని క్లారిటీ గా చెప్పేసింది. కొన్ని వెబ్ సైట్లు వాళ్లు తన పెళ్లి గురించి ఏదో ఒక వార్త రాస్తూ టైంపాస్ చేస్తున్నారని, అలాంటివి తాను పెద్దగా పట్టించుకోనని అంటూ నవ్వుతూ బదులిచ్చింది.
కాగా విజయ పేరును ఎక్కడా ఎత్తకుండా కేవలం తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోను అంటూ మాత్రమే చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇక విజయ్‌తో మరోసారి నటించబోతుందని రష్మిక పై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన ఆడాళ్ళు మీకు జోహార్లు మూవీ మార్చి 4న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో ఆమె సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తూ ఉందా లేదా అన్నది వేచి చూడాలి.
The teaser for Sunny Deol’s next, Suryaa, is out now. The movie was announced a…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has defended the direct election of mayors and…