
వీళ్ళ సంగతి పక్కనపెడితే తాజాగా రష్మిక మందన్న మరోసారి తనను టార్గెట్ చేసే అవకాశం ఇచ్చింది. తన హిందీ సినిమా మిషన్ మజ్ను ప్రమోషన్ లో భాగంగా స్టేజి మీద మాట్లాడుతూ అసలు రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్డని దక్షిణాదిలో ఎప్పుడూ మాస్ మసాలాలు, ఐటెం నెంబర్లే ఉంటాయని అందుకే మొదటిసారి అలాంటి పాటలో నటించే అవకాశం దక్కినందుకు చాలా ఉద్వేగంగా ఉందని పుష్పలో శ్రీవల్లి కన్నా ఎక్కువ రేంజ్ లో మైమరచిపోయి ఎక్స్ ప్రెషన్లు ఇస్తూ సెలవిచ్చింది. అంటే రష్మిక ప్రకారం అసలు తెలుగు తమిళ కన్నడ మళయాలంలో మెలోడీస్ రొమాంటిక్ పాటలే ఉండవు. ఈ నాలుగు భాషలు ఎప్పుడూ మూసలో కొట్టుకుపోయాయని భావం కాబోలు.
అక్కడేదో నలుగురు దృష్టిలో పడాలని తాపత్రయపడింది కానీ రష్మిక తన అవగాహనా లోపం వల్ల బేసిక్స్ ని మర్చిపోయి మాట్లాడింది. తన మాతృ బాష కన్నడలోనే ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితమే డాక్టర్ రాజ్ కుమార్ లాంటి లెజెండ్, రాజన్ నాగేంద్ర, హంసలేఖ లాంటి విఖ్యాత సంగీత దర్శకులు ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ని సినిమా ప్రియులకు కానుకగా ఇచ్చారు. తన మొదటి సినిమా కిరిక్ పార్టీలో ఎలాంటి అసభ్య గీతాలు లేవే. మనవైపుకు వస్తే ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ, ఏఆర్ రెహమాన్ చెప్పుకుంటూ పోతే ఎందరో ఎప్పటికి నిలిచిపోయే పాటలు ఇవ్వలేదా. అసలు ప్రేమ, గీతాంజలి, అల్లరి ప్రియుడు లాంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ మాసాలాలు ఉండవని రష్మికకు తెలుసో లేదో.
ఇంకో పెద్ద జోక్ ఏంటంటే హిందీలో ముందు నుంచి ఏదో ఉదాత్తమైన పాటలు వచ్చినట్టు మాట్లాడ్డం. 90 దశకంలో సాజన్, దిల్ లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఉన్నాయి, చోళీ కే పీచే క్యా హై లాంటి అసభ్యకరమైన ఖల్ నాయక్ బ్రాండ్ పాటలో ఉన్నాయి. అవగాహన లేకపోతే ఏదో మిషన్ మజ్ను పొగిడేసుకుని భజన చేస్తే సరిపోయేదానికి ఇలా మాటలు జారడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అసలు రష్మికకు మిథున్ చక్రవర్తి, గోవిందా ఇలాంటి స్టార్ల ఊర మాస్ సినిమాల గురించి తెలిసినట్టు లేదు. ఆ మధ్య కన్నడ పరిశ్రమ గురించి నోరు జారి నిషేధం అనే ప్రచారం దాకా తెచ్చుకున్న రష్మిక ఈసారి ఏకంగా బ్రెయిన్ వాష్ లో తర్వాత స్థాయికి వెళ్లే ప్లాన్ లో ఉంది కాబోలు.
Following the terrible failure of Coolie, Rajinikanth made a comeback with his most anticipated sequel…
Every actor deserves to do a solo film. Unfortunately, there is a long list of…