
ఈ క్రమంలో రేషన్ షాపుల రద్దు వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అధికారులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జరుగుతున్న అక్రమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం లబ్ధి దారులకు నేరుగా నగదు అందించే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
నగదు నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల ప్రభుత్వంపై ఉన్న చెడ్డపేరు తొలగిపోతుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం కిలోకు 25 భారం భరిస్తోంది. రేషన్ షాపులు రద్దు చేస్తే, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 150 చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంత మందికీ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పర్యవసానంగా కాస్త, అటూ ఇటుగా ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల వరకు అందే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల డీలర్ల అవినీతికి చెక్ పడడంతో పాటు లబ్ధిదారులు తమకు ఇష్టం వచ్చిన బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. నగదు నేరుగా అందించడం వల్ల రేషన్ షాపుల ముందు పడిగాపులు కాసే అవస్థ తప్పుతుందని, ఏ సరుకులు కొనుక్కోవాలి? ఎప్పుడు కొనుక్కోవాలి? అన్నది లబ్ధిదారుడే నిర్ణయించుకుంటాడని అధికారులు చెబుతున్నారు.
అవినీతికి అడ్డుకట్ట వేయాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయం సముచితమే గానీ, దీని వలన రైతులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీని వలన రైతుల నుండి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసే అవకాశం ఉండదు గనుక, ఆ విధంగా పంటలు పండించే రైతులు దిక్కుతోచని పరిస్థితి నెలకొనే అవకాశం ఉందనే భావనలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ వ్యవస్థను సరళీకృతం చేయలేక రైతులు పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాల్సి వుంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…