
సందీప్, వర్ష నటించిన “ఊరు పేరు భైరవకోన”…ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానమిచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 9 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు నిర్మాత రాజేష్ దండ.
సంక్రాంతి విడుదల నుంచి తప్పుకుని నాలుగు సినిమాల పోటీ నుంచి వెనక్కి వెళ్లిన రవితేజ ఈగల్ సినిమా కూడా అదే డేట్ న రాబోతున్న తరుణంలో మీ సినిమా పరిస్థితి ఏంటి అంటూ అడిగిన మీడియా ప్రశ్నకు మేము వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు హీరో సందీప్.
మా సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నించి అక్కడ అంత స్పేస్ లేదనే ఉద్దేశంతో వెనక్కి వెళ్లడం జరిగిందని, ఈగల్ సినిమా కంటే ముందే ఆ డేట్ కి మా సినిమాను ప్రకటించామని చెప్పుకొచ్చారు హీరో సందీప్. ముందుగా ఆ డేట్ ను డీజే టిల్లు స్క్వేర్ ప్రకటించడంతో ఆ చిత్ర యూనిట్ కు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నామని ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చే ఉద్దేశం తమకి లేదని ఖరాకండిగా చెప్పారు చిత్ర బృందం.
రవితేజ ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ ఇస్తామని చెప్పి సంక్రాంతి బరి నుండి వెనక్కి రప్పించిన టాలీవుడ్ నిర్మాత మండలికి ఇప్పుడు భైరవకోన తో సందీప్, రాజేష్ దండ మరో కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. “చిన్న సినిమా పెద్ద సినిమాలకు ఎప్పుడు పోటీ కాదు” అనుకునే పరిస్థితి ఇప్పుడు హనుమాన్ తో ప్రశాంత్ వర్మ పూర్తిగా మార్చేశారు.
ఈ నేపథ్యంలో ఈగల్ సినిమాకు ఊరు పేరు భైరవకోన పెద్ద పోటీగానే నిలబడవచ్చని సినిమా లవర్స్ అభిప్రాయపడుతున్నారు. రాజేష్ దండ లేటెస్ట్ రిలీజ్ సామజవరాగమనా కూడా చిన్న సినిమా గా వచ్చి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిర్మాత నుండి వస్తున్న సినిమా కావడంతో, అటు ట్రైలర్ తో కూడా ఆకట్టుకోవడంతో రవితేజ ఈగల్ భైరవకోన ను ఆపగలదా..? అనే సందేహాలు మొదలయ్యాయి. అలాగే హనుమాన్ చిత్ర యూనిట్ కు తమ అభినందనలు తెలియచేసారు.
ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…
Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…