Telugu

ఇరుముడితో రవితేజ ఇరకాటం నుండి బయటపడేనా?

ధామాకా సినిమాతో 100 కోట్ల పోస్టర్ ను సెలబ్రేట్ చేసుకున్న రవితేజ & రవితేజ ఫ్యాన్స్ కి ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క డీసెంట్ సినిమా కూడా లేకుండాపోయింది. వాల్తేరు వీరయ్య హిట్టైనా అది చిరంజీవి ఖాతాలో చేరిపోయింది. దాంతో ధమాకా అనంతరం రవితేజ ఖాతాలో అరడజను డిజాస్టర్లు చేరాయి.

“రావణాసుర, టైగర్ నాగేశ్వర్రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భర్త మహాశయులకి విజ్ఞప్తి” వంటి సినిమాలన్నీ కనీస స్థాయిలో కూడా ఆడలేదు. సరిగ్గా చెప్పాలంటే వీటిలో ఒక్క సినిమా కూడా కనీసం 15 కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో హీరో రవితేజ క్రెడిబిలిటీ ఇరకాటంలో పడింది.

ADVERTISEMENT

హీరోగా ఇంచుమించుగా 30 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. హీరోగా రవితేజ క్రెడిబులిటీకి ఈమధ్యకాలంలో జరిగినంత డ్యామేజ్ ఇంతకుముందు జరగలేదు. అందువల్ల.. “ఇరుముడి” అనే సినిమా రవితేజకి హీరోగా మాత్రమే కాదు వ్యక్తిగానూ చాలా కీలకం.

ఇరుముడి విషయంలో ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి మంచి పాజిటివ్ వైబ్ ఉంది. పాటలు, ట్రైలర్ తో ఆ బజ్ ఇంకాస్త పెరిగింది. సినిమా నిజంగా ట్రైలర్ రేంజ్ లో ఉందంటే చాలు.. హిట్టు గ్యారెంటీ. రవితేజకి మరియు అతడి ఫ్యాన్స్ కి కూడా ఈ హిట్టు చాలా అవసరం. ఆల్రెడీ రెండు హ్యాట్రిక్ ఫ్లాపులు దక్కించుకున్న రవితేజకి, ఇరుముడి ఆ ఫ్లాపుల పరంపర నుండి బ్రేక్ ఇవ్వాలి కానీ.. మూడో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టకూడదు.

హిట్టు, ఫ్లాప్ అనేది నేనేం పట్టించుకోను అని రవితేజ ఒకటికి పదిసార్లు చెప్పినప్పటికీ.. రవితేజ హీరోగా ఇన్నేళ్ల కెరీర్లో టాప్ పొజిషన్ కి చేరుకోకపోవడం అనేది మాత్రం గమనార్హం. వీటన్నిటికీ ఇరుముడి మంచి సమాధానం కావాలి, రవితేజను సరికొత్త కోణంలో ప్రేక్షకులకి పరిచయం చేయాలి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

నాని చేసిన తప్పే విజయ్ కూడా చేస్తున్నాడా?

ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ టైంలో పాన్ ఇండియా అనే పదాన్ని ఎక్కువగా ఎబ్యూజ్ చేస్తున్నామని చెప్పి మరీ.. తెలుగులో తప్ప…

2 hours ago

Rashmika Dragged Again: Kannada Cinema Targeting Her?

Kannada cinema is increasingly proving that films made on modest budgets can find audiences beyond…

3 hours ago