
Ravi Teja faces criticism over his “Muduru Munda” remark at the Irumudi pre-release event
నిన్న హైదరాబాద్ లో జరిగిన “ఇరుముడి” ప్రీరిలీజ్ ఈవెంట్లో మంచి పాజిటివ్ గా, మంచి ఎనర్జీతో సెలబ్రేట్ చేయబడింది. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, అతని పాజిటివిటీ అనేది చూడముచ్చటగా అనిపించింది. ఈమధ్యకాలంలో రవితేజ ఒక ఈవెంట్లో ఇంతలా ఎంజాయ్ చేయడం ఇదే మొదటిసారేమో.
అయితే.. అదే ఈవెంట్లో కూతురు క్యారెక్టర్ ప్లే చేసిన నక్షత్ర అనే మలయాళీ అమ్మాయి గురించి ఆమెతోనే మాట్లాడుతూ “ముదురు ముండా” అన్నాడు రవితేజ. దాంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక పెద్ద స్టార్ హీరో అయినా రవితేజ ఇలా ఒక చిన్నారిని పట్టుకుని ముండా అనడం ఏంటి అని షాక్ అయ్యారు, నిలదీశారు, కోపం కూడా వ్యక్తం చేశారు.
సాధారణంగా కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటాడు రవితేజ. మీడియా ముందుకు రాడు, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడు. అతనొక షెల్ లో బ్రతుకుతుంటాడు. అందువల్ల జనాలకి కూడా మహా అయితే అతడి హీరోయిన్ ఛాయిస్ ల గురించి, అతడి ఫ్లాప్ సినిమాల గురించి ట్రోల్ చేసే ఛాన్స్ దొరికింది కానీ.. రవితేజ పర్సనాలిటీ మీద అతడి బిహేవియర్ మీద ఇప్పటివరకు ఒక్క ట్రోల్ కానీ నెగిటివ్ కామెంట్ కానీ లేదు.
కానీ.. మొదటిసారి రవితేజ టంగ్ స్లిప్ అయ్యాడు. అయితే.. ముండా అనేది ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ఊర్లలో చాలా సాధారణమైన మాట. ఇంట్లో ఆడవాళ్ళని ముండా అంటి, మగవాళ్ళని ముండా కొడకా అని చాలా సింపుల్ గా అనేస్తుంటారు. దాన్ని అందరూ అంతే సింపుల్ గా తీసుకోవాలి అనుకోవడం కూడా అత్యాశే.
ప్రస్తుత తరం ఇంగ్లీష్ లో ఎన్ని బూతులైనా తిట్టుకుంటారు కానీ.. తెలుగు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. అందుకే.. నక్షత్రను ముదురు ముండా అనడాన్ని తీసుకోలేకపోతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయంలో రవితేజ ఎలాగూ రెస్పాండ్ అయ్యి,, ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ.. భవిష్యత్తులో ఇలాంటి ముదురు మాటలు స్టేజ్ మీద పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడకుండా ఉంటే మంచిది. లేకపోతే.. ప్రస్తుత యువతరం ప్రేక్షకుల్లో తనకంటూ మీమ్స్ ద్వారా వచ్చిన పాజిటివ్ ఇమేజ్ ను చేజేతులా పోగొట్టుకుంటాడు.
సో, డియర్ మాస్ మహారాజా రవితేజ, వయసు 60కి దగ్గర పడుతున్నప్పుడు చాదస్తం రావడం అనేది సర్వసాధారణం. అయితే.. మీరున్న స్టేజ్ కి అది అప్రస్తుతం, అనవసరం. అందుకే ఎప్పట్లానే మీ ఎనర్జీతో ఆడియన్స్ కి మరింత దగ్గరవ్వండి, ముదురు మాటలతో దూరమవ్వకండి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…