
ఈ సందర్భంగా రవితేజ అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా రవితేజను కొన్ని ప్రశ్నలు వేసారు. ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల గురించి ‘ఒక్క మాటలో చెప్పాలని’ కోరగా… మహేష్ గురించి అందగాడని, పవన్ గురించి పవర్ ఫుల్ అని, జూనియర్ ఎన్టీఆర్ గురించి మంచి నటుడని పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను సోషల్ మీడియాలో అభిమానులు అడగడం సర్వసాధారణం. కానీ, వీటిని చాలామంది స్కిప్ చేస్తుంటారు. కానీ, రవితేజ మాత్రం అలా చేయకుండా టాలీవుడ్ ముగ్గురు టాప్ హీరోల గురించి చెప్పారు.
ఇండస్ట్రీలో తనకు ఎవరూ శత్రువులు లేరని చెప్పిన రవితేజ, త్వరలోనే పూరీ జగన్నాధ్ తో ఒక సినిమా ఉంటుందని ఖరారు చేసారు. ఇక నుండి నిర్విరామంగా సినిమాలలో నటిస్తానని, మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి తాను సిద్ధమేనని, అయితే అది స్క్రిప్ట్ పై ఆధారపడి ఉంటుందని, అల్లు అర్జున్ తనను ‘రవి అన్న’ అని పిలుస్తాడని, నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అని, అందుకే తానెప్పుడూ ‘పాజిటివ్’గా ఆలోచిస్తానని, ఇటీవల కాలంలో ‘దంగల్’ సినిమాను చాలా మిస్ అయ్యాయని… ఇలా రకరకాల ప్రశ్నలకు బదులిచ్చారు రవితేజ.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…