
“రవితేజ అన్నా… నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నువ్వే నా సూపర్ హీరో. పూరీ, నువ్వు, నేను… ముగ్గురం మన ఇబ్బందులను మనం చవిచూసాం. అన్నా… నువ్వు చేసిన సాయం నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను… దేవుడు ఎప్పుడు నీ యందు ఉంటాడు. నేను డబ్బులు సంపాదించడానికి నువ్వే నా మొదటి హీరో… థాంక్స్ అన్నా..! నా ఇంటి పేరు కూడా రవితేజం… నేను చాలా సంతోషించే విషయం ఇది. నువ్వేంటో మాకు బాగా తెలుసు…” అంటూ మాస్ మహారాజాపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు బండ్ల.
ఇదిలా ఉంటే సిట్ విచారణలో రవితేజ కనీసం భోజనం కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కేవలం డ్రై ఫ్రూట్స్ ను మాత్రమే తీసుకున్నారని తెలియగా, రవితేజతో పాటు మరో ఇద్దరినీ విచారణ చేస్తున్నామని, రవితేజ డ్రైవర్ ను శనివారం నాడు విచారిస్తామని సిట్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. రవితేజపై బండ్ల గణేష్ ఎంతటి విశ్వాసాన్ని ప్రదర్శించాడో, అభిమానులకు అంతే విశ్వాసం నెలకొని ఉంది. కడిగిన ముత్యంలా తమ హీరో ఈ కేసు నుండి బయటకు వస్తారంటూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…