
దానికి దర్శకుడు గోపీచంద్ నిన్ననే రవితేజ షూటింగ్ సెట్స్ పైన కలిశామని బదులివ్వగా, ‘ఇదే… తగ్గించుకుంటే మంచిది’ అంటూ డైరెక్టర్ గోపీచంద్ కు చెప్పి నవ్వుల్లో ముంచెత్తాడు. ‘చేసేసిన హీరోలను కలవడం కాదు, చేయబోయే హీరోలను కలిస్తే స్క్రిప్ట్ బాగా వస్తది’ అంటూ రవితేజ – గోపీచంద్ ల కలయికపై పంచ్ వేశారు బాలయ్య.
రాబోయే ఆరు నెలల్లో నువ్వు ఆయన్ని కలిసావని తెలిసినా, ఆయన నిన్ను కలిసారని తెలిసినా ‘దబిడి దిబిడే’ అంటూ నందమూరి నటసింహం పండించిన వినోదం వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే తన ‘జై బాలయ్య’ సాంగ్ కు రవితేజతో డాన్స్ వేయించిన బాలయ్య, మాస్ మహారాజా రవితేజ బిర్యానీ సాంగ్ కు బాలకృష్ణ డాన్స్ వేసి అలరించారు.
నువ్వు – నేను ఒకటే అబ్బా… లోపలేం పెట్టుకోము, కాకపోతే నేను మీడియాలో కనపడతా, నువ్వు కనిపించవు, అంతే తేడా! ఇలా కాకుండా ఓ రోజు విడిగా కలుద్దాం మనం అని బాలయ్య అనగా, ఆరుబయట చెట్టు కింద ఓ బాటిల్ తో అంటూ రవితేజ ఇచ్చిన హావభావాలకు ఫిదా అయిపోయిన బాలయ్య, నిన్ను హగ్ చేసుకోవాలని ఉందయ్యా అంటూ లేచి హగ్ ఇచ్చారు.
అప్పుడు బట్టలిప్పి మాట్లాడుకుందాం అంటే మేము రెడీ తీసేసి వచ్చేస్తాం అంటూ మాస్ మహారాజా రవితేజ బదులిచ్చారు. నువ్వు దర్శకత్వం వహించబోయే సినిమాలో తాను హీరోగా చేయడానికి రెడీ అన్న బాలయ్య, అప్పుడు అది ‘మాస్ అమ్మా మొగుడు’ అయిపోతుందని నవ్వేశారు. 2021లో బాలయ్య అసలు రూపం ‘ఆహా’ షో ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు తెలిసి రావడం ఊహించని పరిణామం.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…