
టీవీ9 తెలుగు న్యూస్ ఛానల్‌తో మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం, గుర్తింపు సంపాదించుకున్న రవి ప్రకాష్, మొన్ని రాజకీయ పరిణామాల నేపధ్యంలో అకస్మాత్తుగా మీడియా రంగానికి చాలా కాలం పాటు దూరమైపోయారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆర్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలుగు ప్రజల ముందుకు వస్తున్నారు. అది కూడా తన స్టైల్లోనే రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఆయన ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఏవిదంగా ఉండబోతాయో తెలియజేశారు. మళ్ళీ రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రాలో వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నెన్ని సీట్లు వస్తాయో ఆయన తెలియజేశారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం శాసనసభ ఎన్నికలలో…
రాయలసీమ (మొత్తం: 52 స్థానాలు): వాటిలో వైసీపి 29, టిడిపి 22, జనసేన 0, బీజేపీ 0, కాంగ్రెస్ పార్టీ 1 సీట్లు గెలుచుకోబోతున్నాయి.
దక్షిణ కోస్తా (మొత్తం 55 స్థానాలు) వాటిలో వైసీపి 15, టిడిపి 37, జనసేన 2, బీజేపీ 1, కాంగ్రెస్ 0 స్థానాలు గెలుచుకోబోతున్నాయి.
ఉభయగోదావరి, ఉత్తరాంధ్రా (మొత్తం 68 స్థానాలు) వాటిలో వైసీపి 19, టిడిపి 36, జనసేన 11, బీజేపీ 2, కాంగ్రెస్ 0 స్థానాలు గెలుచుకోబోతున్నాయి.
ఈ ప్రకారం రాష్ట్రంలో 175 స్థానాలలో వైసీపి 63, టిడిపి 95, జనసేన 13, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఇతరులు 0 సీట్లు గెలుచుకోబోతున్నాయి.
అంటే ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపికి 63 సీట్లు మాత్రమే గెలుచుకోబోతుండగా, కలిసి పోటీ చేస్తున్న టిడిపి, జనసేన, బీజేపీకు మూడింటికి కలిపి మొత్తం 111 సీట్లు గెలుచుకోబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కనుక టిడిపి, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలలో గెలుచుకోబోతున్నాయని రవి ప్రకాష్ స్పష్టం చేశారు.
టిడిపి, జనసేన, బీజేపీలు కనీసం 120-130 సీట్లు పైనే గెలుచుకుంటాయని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నమ్మకంగా ఉన్నారు. కానీ రవి ప్రకాష్ కాస్త తక్కువ సీట్లు వస్తాయని చెపుతున్నారు. కానీ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టం చేశారు.
వైసీపి, టిడిపి, జనసేన, బీజేపీ మద్య చాలా గట్టి పోటీ నెలకొని ఉన్నందునే వైసీపి 63 సీట్లు గెలుచుకునే పరిస్థితి కనిపిస్తుంటే, సరిగ్గా ఇదే కారణంగా టిడిపి, జనసేన, బీజేపీల కూటమి అంచనాలకు కాస్త తగ్గబోతున్నట్లు రవి
ప్రకాష్ నివేదికని చూస్తే అర్దమవుతుంది. అయితే పోలింగ్‌కు మరో వారం రోజులు గడువు ఉంది. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జరుగుతున్న వాదోపవాదాల కారణంగా ఆలోగా టిడిపి, జనసేన, బీజేపీల కూటమి మరింత పుంజుకోవచ్చు. వైసీపికి మరికొన్ని సీట్లు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నట్లు వారి కూటమికి 120-130 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
Kriti Sanon is ready to enter uncharted territory with her next big screen outing. The…
Vijayawada leader Vangaveeti Radha Krishna has joined the Jana Sena Party after leaving the Telugu…