హుహుహు… హుహుహు… ఆడియన్స్ రియాక్షన్..?

Ravi Teja Khiladi Announces Release Dateబాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సందడి అంటే సంక్రాంతి, సమ్మర్, దసరా ఎక్కువగా గుర్తొస్తుంటాయి. కానీ ఈ ట్రెండ్ 2022 నుండి మారబోతోంది. ముఖ్యంగా “ఆర్ఆర్ఆర్” సినిమా సంక్రాంతికి పోస్ట్ పోన్ కావడం మరియు కరోనా వలన ఆగిన రిలీజ్ లు, అలాగే ఏపీలో సినీ ఇండస్ట్రీ చవిచూస్తోన్న ఇబ్బందులతో సంక్రాంతి తదుపరి కూడా పెద్ద హీరోల సినిమాలు కొనసాగనున్నాయి.

సంక్రాంతికి “ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, బంగార్రాజు” సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, జనవరి 26వ తేదీకి సంక్రాంతికి మిస్ అయిన మూవీస్ రిలీజ్ ల ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే టాలీవుడ్ కు అన్ సీజన్ గా భావించే ఫిబ్రవరిలో పెద్ద హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 4వ తేదీన “ఆచార్య,” 25వ తేదీన “ఎఫ్ 3” రిలీజ్ డేట్స్ ప్రకటించగా, తాజాగా రవితేజ కూడా తన సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ADVERTISEMENT

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తోన్న “కిలాడి” సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచినప్పటికీ, విద్యార్థుల పరీక్షల సమయంగా భావించి సినీ ఇండస్ట్రీకి అన్ సీజన్ గా అనుకునే ఫిబ్రవరి సినిమాలపై సినీ ప్రేక్షకులు ఎలాంటి రియాక్షన్ ను ఇవ్వనున్నారో చూడాలి!

ADVERTISEMENT
Latest Stories