Telugu

హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబి…

ఐపీఎల్ అనే లీగ్ 2008 లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి దాకా స్టార్ ప్లేయర్స్ కు పెట్టింది పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్. అనిల్ కుంబ్లే, రాస్ టేలర్, రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలతో మొదలై విరాట్ కోహ్లీ, ఏ.బీ.డీ విలియర్స్, క్రిస్ గేల్, సిరాజ్, చాహల్, స్టెయిన్, మ్యాక్సీ వంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ ఆటగాళ్లను కొనుగోలుచేసిన ఫ్రాంచైజ్ ఇది.

కానీ, కాలం కలిసి రాకుంటే కోహ్లీ ఉన్నా క్రిస్ గేల్ ఉన్నా, ట్రోఫీ మాత్రం ఉండదని ఈ ఫ్రాంచైజ్ ను చూస్తేనే అర్ధమవుతుంది. అనేకానేక సార్లు ప్లే-ఆప్స్ కు అర్హత సాధించినప్పటికీ దాన్ని ట్రోఫీ గా కన్వర్ట్ చేసుకునే క్రమంలో వెనుకబడింది ఆర్.సి.బీ. 2024 కు ముందు వరుకు 3 సార్లు ఫైనల్స్ ను చేరిన ఆ జట్టు మూడు సార్లు ఓటమి గాలిలో కొట్టుకుపోయారు.

ADVERTISEMENT

2016 లో విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ కి ఆర్.సి.బీ ట్రోఫీ ఎందుకు గెలవలేకపోయింది అనే ప్రశ్నకు నేటికీ ఏ క్రికెట్ పండితుని దగ్గర సమాధానముండదు. లీగ్ స్టేజ్ నుండి మరో మ్యాచ్ ఓడితే ఎలిమినేట్ అయ్యే స్థాయి వరకు వెళ్లి కూడా ఫినాలే కు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించిన ఆర్.సి.బీ ఫామ్ చూసి భయపడిన అపోజిషన్ లేదంటే అతిశయోక్తి కాదేమో.

కానీ, అప్పుడు కూడా ఫైనల్ లో హైదరాబాద్ చేతిలో 7 పరుగుల తేడాతో గెలుపు అంచుల వరుకు వెళ్లి ఓటమి ట్రోపిని చేజారుకున్నారు. కానీ, ఆర్.సి.బీ జట్టు తన స్తైర్యాన్ని కోల్పోకుండా ఈసారి కప్ నంద అంటూ స్పోర్టివ్ స్పిరిట్ తో ముందుకెళ్లింది. 2020 నుండి సుమారు ప్రతి సీజన్ ప్లే-ఆప్స్ లో అడుగు పెట్టారు ఆర్.సి.బీ.

కానీ, వారి మొదటి ట్రోఫీ కళను నెరవేర్చింది మాత్రం ‘స్మ్రితి మందాన’. 2023 లో ఉమెన్స్ ఐపీఎల్ మొదలు కాగా 2024 ఉమెన్స్ ఐపీఎల్ లో మందాన నేతృత్వం తో ఉన్న ఆ జట్టు తొలిసారి రాయల్ చాలెంజర్స్ ఫ్రాంచైజ్ కు కప్పును తెచ్చి పెట్టింది. ఈ సంఘటనను ఏ ఆర్.సి.బీ అభిమాని మరువలేరు.

అయితే, ఆ సీజన్ లో మేన్స్ ఆర్.సి.బీ చూపిన పోరాట పటిమ కు మేన్స్ జట్టు కూడా కప్పు ఎగరేసుకుపోతారనుకున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ప్లే-ఆప్స్ లో రాజస్థాన్ జట్టు పై ఓడి కప్పు వేట లో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు ఆర్.సి.బీ మెన్స్ జట్టు.

కానీ, అప్పుడు ఎవరు అనుకోలేదు.. రానున్న రెండేళ్లు ఆర్.సి.బీ ఫ్రాంచైజ్ చరిత్ర లోనే మరువరానివి అని. 2025 లో 17 ఏళ్ళ నిరీక్షణ, నిస్పృహ కు 18 నెంబర్ జేర్సీ వేసుకున్న విరాట్ కోహ్లీ చేతిలో ఈ సాల కప్ నందు అంటూ మెరిసిపోయింది ఆ 18వ సీజన్ ఐపీఎల్ ట్రోఫీ.

17 ఏళ్లగా ఒక మనిషి ఎన్ని నిరాశలు ఎదురైనా పట్టు విడువకుండా, జట్టుతో మమేకమై, తోటి ఆటగాళ్లు ఎంతమంది తనను విడిచి వెళ్తున్నా, కొత్తగా వచ్చేవారితో కలిసి మరలా అదే కసితో ట్రోఫీని వెంటాడుతున్న ఆ 18 నెంబర్ జెర్సీ కు 18వ సీజన్లోనే తొలి ఐపీఎల్ ట్రోఫీ రావాలని రాసిపెట్టుందేమో కానీ,

మ్యాచ్ ముగిసే చివరి క్షణాల్లో గ్రౌండ్ పైనే కంట నీళ్లు పెట్టుకున్న విరాట్ ను చూసి భావోద్వేగానికి లోనవని అభిమాని లేడు. ఇలా, 2025 ఆర్.సి.బీ జట్టుకు గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిందనుకునే లోపే 2026 లో ఉమెన్స్ ఆర్.సి.బీ మరొక కప్పును ఎగరేసుకుపోయారు.

2026 ఉమెన్స్ ఐపీఎల్ ను మొదటి నుండే డామినేట్ చేస్తూ వచ్చారు ఆర్.సి.బీ. గ్రెస్ హారిస్, స్మ్రితి, రిచా, రాధా మరియు బెల్ వంటి వారు కీలక ప్లేయర్స్ గా ఉన్న ఈ జట్టు లీగ్ స్టేజి లో టేబుల్ టాపర్స్ గా నిలిచి నేరుగా ఫైనల్ కు చేరారు. ఇక నిన్న జరిగిన ఫైనల్ లో ఢిల్లీ మహిళలు తొలుత బ్యాటింగ్ చేసి 204 భారీ లక్ష్యాన్ని ఆర్.సి.బీ ముందు ఉంచారు.

అంత భారీ లక్ష్య ఛేదనలో 2 వ ఓవర్ లోనే గ్రెస్ హారిస్ వికెట్ ను కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో ఉన్న జట్టును స్మ్రితి-వోల్ జంట ఆదుకుంది. 15 ఓవర్ల వ్యవధిలో 165 పరుగులు చేసి కప్పును ఆర్.సి.బీ చేతిలో పెట్టారు ఈ ఇరువురు. చివర్లో పరిస్థితి కాస్త అటు-ఇటు అయినప్పటికీ రాధా బౌండరీ తో ఆర్.సి.బీ ఉమెన్స్ 2వ కప్పు కొల్లగొట్టారు.

ఇలా, ఒకప్పుడు ట్రోఫీల కరువు లో 10 ఏళ్ళు ఉన్న ఆర్.సి.బీ ఫ్రాంచైజ్ కు 2024, 25, 26 ఇలా వరుసగా మూడేళ్లలో 3 ట్రోఫీ లు వచ్చి పడ్డాయి. చూడాలి, 2026 ఐపీఎల్ లో ఆర్.సి.బీ మేన్స్ జట్టు ప్రదర్సన ఎలా ఉంటుందో అని..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

4 hours ago

Toxic English Version Flops: Yash’s Ramayana at Risk?

Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…

5 hours ago