
18 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, ఆర్సీబీ అభిమానుల చిరకాల కోరిక, కోహ్లీ ఫాన్స్ ఆరాటం అన్ని కలిపి ఐపీల్ చరిత్రలో ఆర్సీబి గత ఏడాది విజయాన్ని నమోదయ్యింది. అయితే ఆ విజయోత్సవాలు నెత్తుటి మరకలతో లికించిన చేదు జ్ఞాపకంగా మారడంతో ఇప్పటికి ఆర్సీబి అభిమానులనే కాదు క్రికెట్ ప్రేమికులను ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.
అయితే నాడు ఐపీల్ కప్పు కొట్టిన ఆర్సీబీ తన గెలుపు సంబరాలు నిర్వహించుకోవడానికి తన హోమ్ గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియం ను ఎంచుకోవడం, అక్కడ లెక్కకు మించి అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి ఆ ఆనందోత్సవాలు కాస్త అభిమానుల ఆర్తనాదాలుగా మారిపోయాయి.
అయితే ఆ విషాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ఆర్సీబీ తన అభిమానులను బయటకు తీసుకొచ్చేందుకు గాను ఈసారి జరగబోయే ఐపీల్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ లు జరిగే స్థానంలో చిన్నస్వామి స్టేడియం ను తప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇన్నాళ్ళుగా ఆర్సీబీ కి హోమ్ గ్రౌండ్ గా ఉన్న చిన్న స్వామి స్టేడియం స్థానంలో ఇప్పుడు ఆ జట్టు యజమాన్యం మహారాష్ట్ర లోని పూణే స్టేడియం ను ఎంచుకున్నట్టు క్రీడా వర్గాలలో చర్చ జరుగుతుంది. దీనితో ఇకనుంచి ఆర్సీబీ చిన్న స్వామి స్టేడియం కు దూరమయినట్టే అన్న ప్రచారం జరుగుతుంది.
అయితే ఇది ఆర్సీబీ అభిమానులకు, అక్కడ హోమ్ గ్రౌండ్ ఉన్న వారికి ఊహించని పరిణామమనే చెప్పాలి. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీ కి హోమ్ గ్రౌండ్ అనేది కూడా లేకుండా పోతుంది. 18 ఎల్లా నిరీక్షణ తరువాత దక్కిన విజయం తాలూకా విషాదాన్ని ఆర్సీబీ చెరపగలదా.?
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…