
కానీ డబ్బింగుల పోటీ మాములుగా లేదు. తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే తెలుగు యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో దిల్ రాజు రీమేక్ జోలికి వెళ్లకుండా అనువాదం రూపంలో తీసుకొస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవు కానీ మొదటి రోజు ఒక రెండాటలు అయ్యాక పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే మాత్రం అమాంతం కలెక్షన్లు వచ్చి పడతాయి. నాలుగు వందలకు పైగా థియేటర్లతో నిర్మాత దిల్ రాజు గ్రాండ్ ప్లానింగే చేశారు. బాలీవుడ్ తోడేలు మీద బజ్ లేకపోయినా అల్లు అరవింద్ సమర్పణలో దీనికీ చెప్పుకోదగ్గ స్క్రీన్లు దక్కాయి. పైగా త్రీడి వెర్షన్ కూడా ఇస్తున్నారు. వరుణ్ ధావన్ ని ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకొచ్చి మరీ ప్రమోషన్లు చేయించారు.
ఇప్పుడీ లవ్ ని తోడేలుని అల్లరి నరేష్ ధీటుగా ఎదురుకోవాల్సి ఉంటుంది. మన సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న వాదన అరణ్య ఘోషగా మారబోతోందనే ఉదాహరణకు ఈ 25వ తేదీనే వేదికయ్యేలా ఉంది. ఎటొచ్చి మారేడుమిల్లికే తగినన్ని స్క్రీన్లు వస్తాయానే అనుమానం లేకపోలేదు. ముఖ్యంగా థియేటర్లు తక్కువగా ఉండే బిసి సెంటర్స్ లో ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మాసూద, గాలోడు అలాంటి చోట్ల రెండో వారం కంటిన్యూ అవుతున్నాయి. యశోద సైతం కొన్ని సెంటర్స్ లో కొనసాగుతోంది. నాలుగైదు థియేటర్లు మాత్రమే ఉండే చిన్న ఊళ్ళలో లవ్ టుడే, తోడేలుని కాదని ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంకే బయ్యర్లు జై కొడతారంటే నమ్మలేం.
అసలే ఈ ఏడాది చెప్పుకోదగ్గ స్థాయిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బింగులు హవా జోరుగా నడిచింది. కాంతార కొత్త రికార్డులు నమోదు చేస్తే కెజిఎఫ్ 2 ఏకంగా ఆర్ఆర్ఆర్ కు పోటీ ఇచ్చింది. ఇదేం చేస్తుందిలే అనుకుంటే కమల్ హాసన్ విక్రమ్ ఏకంగా రెట్టింపు లాభాలతో నితిన్ బ్యానర్ ని ముంచెత్తింది. 777 ఛార్లీకి నెల రోజులకు పైగా రన్ దక్కింది. సైలెంట్ కిల్లర్ గా వచ్చిన సర్దార్ కొన్నవాళ్ళకు లాభాలు ఇచ్చింది. పొన్నియన్ సెల్వన్ 1, బ్రహ్మాస్త్ర 1 తెచ్చిన వసూళ్లు తక్కువేమీ కాదు.. కాబట్టే లవ్ టుడే, తోడేలుని తక్కువ అంచనా వేయడం కుదరదు. అందుకే అల్లరి నరేష్ కు పెద్ద ఫైట్ తప్పేలా లేదు. కంటెంట్ నే నమ్ముతున్నాడు కనక నెగ్గాలనే నమ్మకం నిజం కావాలనేదే సగటు సినిమా అభిమాని ఆశ.
Following the terrible failure of Coolie, Rajinikanth made a comeback with his most anticipated sequel…
Every actor deserves to do a solo film. Unfortunately, there is a long list of…