Telugu

జగన్ కి తన సొంత బలంపై నమ్మకం పోయిందా?

ఇటీవలే కాలంలో భాజపా తెదేపాతో తెగతెంపులు చేస్కోనుండని వైకాపాతో జాతకట్టనుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఐతే ఇటీవలే వచ్చిన అన్ని ఎన్నికల ఫలితాలు తెదేపాకు అనుకూలంగా ఉండటంతో ఆ వార్తలకు కొద్ది రోజులు బ్రేక్ పడ్డాయి. ఐతే అవే వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి గత వారం రోజులుగా.

ADVERTISEMENT

ఈమధ్యనే జగన్ స్వయంగా భాజపా ఎంపీ గోకరాజు రంగరాజు ఇంటికి వెళ్ళి సంఘ్ పరివార్ తో దౌత్యం నడపమని అడిగారని సమాచారం. జగన్ ఈ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచదలిస్తే, డిల్లీలోని కొందరు పెద్దలు కావాలని మీడియాకు ఈ సమాచారం అందించారు. ఎందుకు అనేది ఓపెన్ సీక్రెట్.

మంగళవారం రోజు జగన్ మరియు విజయ సాయి రెడ్డి కలిసి చిన్న జీయర్ స్వామిని కలవడం జరిగింది. సంఘ్ తో ఎలాగైనా బేరం కుదర్చమని బ్రతిమాళడారని మరో సమాచారం. ఒకవేళ ఈ రెండు విషయాలు గనుక నిజం ఐతే భాజపాతో జాతకట్టడానికి జగన్ ఆరాట పడుతున్నాడా? అని అనుమానం కలగడం తప్పేమీ కాదు? ఐతే దీనికి కారణం ఏమీ అవ్వొచు? తన పై ఉన్న కేసులను చూసి జగన్ బయపడుతున్నాడా? లేక తన సొంత బలంతో ఎన్నికలు గెలుస్తాం అన్న నమ్మకం పోయిందా? ఐతే భాజపా తో జత కడితే తన సొంత వోట్ బ్యాంక్ ఐన మైనారిటీల పరిస్తితి ఏంటి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Anil Ravipudi Says Festivals Don’t Matter, Then Why Sankranthi Again?

Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…

25 minutes ago

‘ఎపిక్’ సినిమా రివ్యూ: అర్థం లేని ప్రేమకథ!

చిత్రం: ఎపిక్ M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 11, 2026 తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,…

38 minutes ago