రెడ్‌బుక్‌ మాకే అంకితం: సజ్జల

శాసనసభ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో, జగన్‌ ముందుగా సజ్జల రామకృష్ణా రెడ్డిని పక్కన పెట్టేశారు. ఆయన, కొడుకు భార్గవ్ ఇద్దరూ కలిసి తనని ముంచేశారని జగన్‌ భావించడమే అందుకు కారణం. అది నిజం కూడా.

వైసీపీ ఓటమికి వారిరువురు కంటే జగన్‌ తప్పుడు ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు, అవినీతి, ఆరాచకాలే కారణమని వైసీపీలో అందరికీ తెలుసు కానీ ధైర్యంగా ఆయనకు చెప్పేవారే లేరు.

ADVERTISEMENT

సజ్జల తన కొంప ముంచినప్పటికీ మీడియాని హ్యాండిల్ చేయడం తన వల్ల కాదని జగన్‌ చాలా త్వరగానే గ్రహించారు. అందుకే మళ్ళీ సజ్జలని తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు.

కనుక ఇంతకాలం ఆయన వితాండవాదనలు వినిపించక అల్లాడుతున్న ఆంధ్రా ప్రజలు మళ్ళీ ఆయనని చూడగలుగుతున్నారు. ఆయన మాటలు వినగలుగుతున్నారు. సజ్జల మళ్ళీ ఛార్జ్ తీసుకున్నారు కనుక జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో హాయిగా రిలాక్స్ అవగలుగుతున్నారు.

మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ శుక్రవారం సజ్జలని తోడ్కొని మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఆయన ఈసారి ‘రెడ్‌బుక్‌ టాపిక్’ మీద ప్రసంగించారు.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ‘రెడ్‌బుక్‌’ రెడీ చేసుకుందని, అధికారంలోకి రాగానే తండ్రీ కొడుకులు దానిని ఎడాపెడా వైసీపీ నేతలు, కార్యకర్తలపై వాడేస్తున్నారని సజ్జల ఆరోపించారు. టీడీపీలో సిఎం చంద్రబాబు నాయుడు మొదలు పార్టీ కార్యకర్త వరకు ఎవరికి వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎందుకు కోపం వచ్చినా వెంటనే పోలీసులు వచ్చి తమపై కేసులు నమోదు చేసేస్తున్నారని సజ్జల ఆరోపించారు.

వారు ఆడమన్నట్లు పోలీసులు ఆడుతున్నారని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. పదవి, అధికారాలను ఇంతగా దుర్వినియోగం చేయడం తాను ఎన్నడూ చూడలేదని సజ్జల అన్నారు.

పోలీసులు నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని విచారించినప్పుడు, సజ్జల ఆదేశం మేరకే తాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ మాట్లాడేవాడినని చెప్పారు. ఆయన ఇచ్చిన స్క్రిప్టులో ఉన్న విషయాలే తాను చదివానని చెప్పారు. అంటే సజ్జల పైకి పెద్ద మనిషిలా కనిపిస్తూ నీతులు వల్లిస్తున్నప్పటికీ, ఆయన మాటలకు, చేతలకు సంబంధం ఉండదని స్పష్టమవుతోంది.

పోలీసులు తనని, కొడుకు భార్గవ్‌ని అరెస్ట్‌ చేస్తారని భయపడి సజ్జల అండ్ సన్స్ హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్‌ సంపాదించుకున్నారు. కానీ అరెస్ట్‌ భయం ఇంకా ఆయనలో ఉందని నేడు రెడ్‌బుక్‌ సాక్షిగా బయటపెట్టుకున్నారు.. అని అనుకోవాలి.. అంతే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

15 minutes ago

Is Rashmika Too Busy For Ranabaali? Vijay Explains

Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…

15 minutes ago