
జగన్ ప్రభుత్వం అమరావతిపై కులం ముద్ర వేసి దానిని పాడుబెట్టేసింది. టిడిపి హయాంలో అన్ని పదవులు కమ్మవారికే కట్టబెట్టేశారని జగన్ ఆరోపించారు. కనుక ఆయన అందరికీ సమానావకాశాలు కల్పిస్తారనుకొంటే రాష్ట్రంలో రెడ్డిరాజ్యం స్థాపిస్తున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణగా రెండుసార్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగియగానే ఆయన స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. తిరుపతి ఈవోగా ధర్మారెడ్డి చాలా కాలంగా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే.
కరుణాకర్ రెడ్డి ఇదివరకు రెండుసార్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్‌లో డెప్యూటీ మేయర్‌గా ఉన్నారు. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తే వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోనని చెప్పుకొని కరుణాకర్ రెడ్డి ఆ పదవి పొందారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి నియోజకవర్గం టికెట్ తన కొడుకు అభినయ్ రెడ్డికి ఇవ్వాలని జగన్‌ను కోరగా అందుకు ఆయన ఒకే చెప్పిన్నట్లు తెలుస్తోంది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ పదవికి నష్టపరిహారమన్నట్లు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని తిరుపతి నగరాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్‌గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి పొందడంతో ఆయన టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉండే అవకాశం కూడా లభిస్తుంది. వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఖరారు చేస్తున్నట్లు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా కూడా నియమితులయ్యారు.
ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో అన్ని కీలక పదవులలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారినే నియమిస్తూ రాష్ట్రంలో రెడ్డి రాజ్యస్థాపన చేస్తున్నారు.
Apple has released the new addition to their line of iPhones in the form of…
Srikanth Odela’s The Paradise is carrying huge expectations. The Nani starrer is finally locked for…