
సైట్ నెమ్మదిగా ఓపెన్ కావడంతో వినియోగదారులు నిరాశ చెందారు. దీంతో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేశారు. వినియోగదారుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జియో ఈ గడువును పొడిగించినట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును పెంచడంతో పాటు జియో మరో ‘సమ్మర్ ఆఫర్’ను కూడా ప్రకటించింది. జియో గతంలో ప్రకటించిన రీ చార్జ్ ప్లాన్లను బట్టి 303తో రీ చార్జ్ చేసుకుంటే కేవలం నెల రోజుల పాటు మాత్రమే అపరిమిత వాయిస్ కాల్స్, డేటా సేవలు లభించేవి.
కానీ ఈ ‘సమ్మర్’ ఆఫర్ లో భాగంగా సదరు మొత్తం సేవలను మూడు నెలలకు పెంచింది. అంటే ఒకసారి 303తో రీ-చార్జ్ చేసుకుంటే ఏప్రిల్, మే, జూన్ మాసాల వరకు మళ్ళీ ఉచిత సేవలు పొందవచ్చన్న మాట. ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా వినియోగదారులు ‘ప్రైమ్’ సభ్యత్వం తీసుకున్నట్టు, ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని, ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్ వర్క్ గా జియో అవతరించిందని అధికారికంగా ప్రకటించింది. తాజా బంపర్ ఆఫర్ తో జియో కస్టమర్లకు నిజంగా మరోసారి పండగ వాతావరణం నెలకొంది.
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…
Well, the inevitable has happened as the Telangana government under the leadership of Chief minister…