Telugu

ముఖేష్ అంబానీయే ఫస్ట్… టాప్ 100 బిలియనిర్స్ జాబితా..!

mukesh-ambaniఇండియాలో ఈ ఏటి అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. గత సంవత్సరంలో మాదిరిగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ముఖేష్ నికర ఆస్తి విలువ 22.7 బిలియన్ డాలర్లని (సుమారు 1.52 లక్షల కోట్లు), గత సంవత్సరం 18.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే… ఈక్విటీ విలువ 21 శాతం పెరగడం ముఖేష్ సంపద వృద్ధికి కారణమని వివరించింది.

ADVERTISEMENT

2015తో పోలిస్తే ఇండియాలోని టాప్-100 బిలియనీర్ల ఆస్తి విలువ 10 శాతం పెరిగి 345 బిలియన్ డాలర్ల నుంచి 381 బిలియన్ డాలర్లకు చేరిందని వెల్లడించింది. బ్రెగ్జిట్ తరువాత, స్థిరంగా సాగుతున్న భారత ఎకానమీ, బిలియనీర్ల సంఖ్యను పెంచిందని, గతంలో ఈ జాబితాలో చేర్చడానికి 1 బిలియన్ డాలర్ల ఆస్తిని ప్రాతిపదికన తీసుకున్నామని, ఈ సంవత్సరం నుంచి దాన్ని 1.25 బిలియన్ డాలర్లకు పెంచామని తెలిపారు. ఇక ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా 16.9 బిలియన్ డాలర్ల (సుమారు 1.13 లక్షల కోట్లు) ఆస్తితో ఫార్మా దిగ్గజం దిలీప్ సాంఘ్వీ ఉన్నారు. మూడవ స్థానంలో హిందుజా సోదరులు 15.2 బిలియన్ డాలర్ల (సుమారు 1.01 లక్షల కోట్లు) ఆస్తితో నిలిచారు. భారత బిలియనీర్ల టాప్-100 పూర్తి జాబితాను పరిశీలిస్తే…
(ఒక బిలియన్ డాలర్ 6,706 కోట్లకు సమానం)
ర్యాంకు, బిలియనీర్ పేరు, వారి ఆస్తి, వయసు వివరాలివి
1. ముఖేష్ అంబానీ – 22.7 బి. డాలర్లు, వయసు – 59
2. దిలీప్ సంఘ్వీ – 16.9 బి. డాలర్లు, వయసు – 60
3. హిందూజా సోదరులు – 15.2 బి. డాలర్లు
4. అజీమ్ ప్రేమ్ జీ – 15 బి. డాలర్లు, వయసు – 71
5. పల్లోంజీ మిస్త్రీ – 13.9 బి. డాలర్లు, వయసు – 87
6. లక్ష్మీ మిట్టల్ – 12.5 బి. డాలర్లు, వయసు – 66
7. గోద్రెజ్ కుటుంబం – 12.4 బి. డాలర్లు
8. శివ్ నాడార్ – 11.4 బి. డాలర్లు, వయసు – 71
9. కుమార్ బిర్లా – 8.8 బి. డాలర్లు, వయసు – 49
10. సైరస్ పొన్నావాలా – 8.6 బి. డాలర్లు, వయసు – 75
11. ఉదయ్ కొటక్ – 8.3 బి. డాలర్లు, వయసు – 57
12. సునీల్ మిట్టల్ – 6.6 బి. డాలర్లు, వయసు – 59
13. గౌతమ్ అదానీ – 6.3 బి. డాలర్లు, వయసు – 54
14. బేను గోపాల్ బంగూర్ – 5.9 బి. డాలర్లు, వయసు – 85
15. ఆనంద్ బర్మన్ – 5.85 బి. డాలర్లు, వయసు – 64
16. శశి రూయా అండ్ రవి రూయా – 5.8 బి. డాలర్లు, వయసు – 72 (శశి), 67 (రవి)
17. బజాజ్ కుటుంబం- 5.7 బి. డాలర్లు
18. సుభాష్ చంద్ర – 5.6 బి. డాలర్లు, వయసు – 65
19. సావిత్రి జిందాల్ – 5.3 బి. డాలర్లు, వయసు – 66
20. దేశ్ బంధు గుప్తా – 5.1 బి. డాలర్లు, వయసు – 78
21. విక్రమ్ లాల్ – 5 బి. డాలర్లు, వయసు – 74
22. కుషాల్ పాల్ సింగ్ – 4.8 బి. డాలర్లు, వయసు – 85
23. పంకజ్ పటేల్ – 4.5 బి. డాలర్లు, వయసు – 63
24. మిక్కీ జగ్తియానీ – 4.4 బి. డాలర్లు, వయసు – 65
25. ఎం.ఎ. యూసుఫ్ అలీ – 4 బి. డాలర్లు, వయసు – 60
26. మధుకర్ పరేఖ్ – 3.9 బి. డాలర్లు, వయసు – 70
27. సుధీర్ అండ్ సమీర్ మెహతా – 3.85 బి. డాలర్లు, వయసు – 62 (సుధీర్), 53 (సమీర్)
28. కులదీప్ అండ్ గుర్బచన్ సింగ్ ధింగ్రా – 3.7 బి. డాలర్లు, వయసు – 69 (కులదీప్), 66 గుర్బచన్
29. పవన్ ముంజాల్ – 3.65 బి. డాలర్లు, వయసు – 62
30. హర్ష మరివాలా – 3.64 బి. డాలర్లు, వయసు – 65
31. వివేక్ చాంద్ సెహగల్ – 3.6 బి. డాలర్లు, వయసు – 59
32. అనిల్ అంబానీ – 3.4 బి. డాలర్లు, వయసు – 57
33. కపిల్ అండ్ రాహుల్ భాటియా – 3.35 బి. డాలర్లు, వయసు – 84 (కపిల్), 56 (రాహుల్)
34. అశ్విన్ డానీ – 3.3 బి. డాలర్లు, వయసు – 73
35. అజయ్ పిరమల్ – 3.25 బి. డాలర్లు, వయసు – 61
36. జైన్ ఫ్యామిలీ – 3.2 బి. డాలర్లు
37. పివి రామ్ ప్రసాద్ రెడ్డి – 3.15 బి. డాలర్లు, వయసు – 58
38. రవి పిళ్లై – 3.1 బి. డాలర్లు, వయసు – 63
39. విజయ్ చౌహాన్ – 3 బి. డాలర్లు, వయసు – 80
40. కళానిధి మారన్ – 2.9 బి. డాలర్లు, వయసు – 51
41. మురళి దివి – 2.8 బి. డాలర్లు, వయసు – 65
42. సంప్రదా సింగ్ – 2.7 బి. డాలర్లు, వయసు – 90
43. అశ్విన్ చోక్సీ – 2.65 బి. డాలర్లు, వయసు – 73
44. యూసుఫ్ హమేద్ – 2.6 బి. డాలర్లు, వయసు – 80
45. రాజన్ రహేజా – 2.55 బి. డాలర్లు, వయసు – 62
46. వినోద్ అండ్ అనిల్ రాయ్ గుప్త – 2.52 బి. డాలర్లు, వయసు – 71 (వినోద్), 47 (అనిల్)
47. బీఆర్ శెట్టి – 2.51 బి. డాలర్లు, వయసు – 74
48. ఆచార్య బాలకృష్ణ – 2.5 బి. డాలర్లు, వయసు – 44
49. అభయ్ వకీల్ – 2.45 బి. డాలర్లు, వయసు – 65
50. చంద్రు రహేజా – 2.4 బి. డాలర్లు, వయసు – 76
51. బాబా కళ్యాణి – 2.25 బి. డాలర్లు, వయసు – 67
52. కర్సన్ భాయ్ పటేల్ – 2.24 బి. డాలర్లు, వయసు – 72
53. రాకేష్ ఝున్ ఝున్ వాలా – 2.2 బి. డాలర్లు, వయసు – 56
54. రెడ్డి ఫ్యామిలీ (డాక్టర్ రెడ్డీస్) – 2.15 బి. డాలర్లు
55. అమాల్గమేషన్స్ గ్రూప్ కుటుంబం – 2.1 బి. డాలర్లు
56. మంగళ్ ప్రభాత్ లోధా – 2.05 బి. డాలర్లు, వయసు – 60
57. సునీల్ వాస్వానీ – 2 బి. డాలర్లు, వయసు – 53
58. రాజేంద్ర అగర్వాల్ – 1.95 బి. డాలర్లు, వయసు – తెలియదు
59. ఎంజి జార్జ్ ముత్తూట్ – 1.92 బి. డాలర్లు, వయసు – 66
60. సన్నీ వర్కీ – 1.9 బి. డాలర్లు, వయసు – 59
61. రాజేష్ మెహతా – 1.88 బి. డాలర్లు, వయసు – 52
62. ఎన్ఆర్ నారాయణ మూర్తి – 1.87 బి. డాలర్లు, వయసు – 70
63. అనిల్ అగర్వాల్ – 1.86 బి. డాలర్లు, వయసు – 63
64. మన్నాలాల్ అగర్వాల్ – 1.85 బి. డాలర్లు, వయసు – 69
65. కిరణ్ మజుందార్ షా – 1.83 బి. డాలర్లు, వయసు – 63
66. హస్ముక్ చుద్గర్ – 1.8 బి. డాలర్లు, వయసు – 83
67. మోఫత్ రాజ్ మునోత్ – 1.79 బి. డాలర్లు, వయసు – 71
68. లచ్మన్ దాస్ మిట్టల్ – 1.78 బి. డాలర్లు, వయసు – 85
69. గ్లెన్ సల్దానా – 1.77 బి. డాలర్లు, వయసు – 45
70. అభయ్ ఫిరోడియా – 1.76 బి. డాలర్లు, వయసు – 71
71. నిరావ్ మోడీ – 1.74 బి. డాలర్లు, వయసు – 45
72. రమేష్ జునేజా – 1.72 బి. డాలర్లు, వయసు – 63
73. మురుగప్ప కుటుంబం – 1.7 బి. డాలర్లు
74. రంజన్ పాయ్ – 1.69 బి. డాలర్లు, వయసు – 43
75. హర్ష్ గోయెంకా – 1.67 బి. డాలర్లు, వయసు – 58
76. జితేంద్ర వీర్వానీ – 1.66 బి. డాలర్లు, వయసు – 50
77. సలీల్ సింఘాల్ – 1.65 బి. డాలర్లు, వయసు – 69
78. పీఎన్సీ మీనన్ – 1.64 బి. డాలర్లు, వయసు – 67
79. లీనా తివారీ – 1.63 బి. డాలర్లు, వయసు – 59
80. నందన్ నిలేకని – 1.62 బి. డాలర్లు, వయసు – 61
81. ఎస్ గోపాలకృష్ణన్ – 1.61 బి. డాలర్లు, వయసు – 61
82. సతీష్ మెహతా – 1.6 బి. డాలర్లు, వయసు – 65
83. రవి జైపూరియా – 1.57 బి. డాలర్లు, వయసు – 61
84. రాదేశ్యాం అగర్వాల్ – 1.56 బి. డాలర్లు, వయసు – 71
84. రాదే శ్యాం గోయెంకా – 1.56 బి. డాలర్లు, వయసు – 70
86. సమీర్ గెహ్లాట్ – 1.55 బి. డాలర్లు, వయసు – 42
87. దేవేంద్ర జైన్ – 1.54 బి. డాలర్లు, వయసు – 87
88. జైహరి అండ్ యదు హరి దాల్మియా – 1.5 బి. డాలర్లు, వయసు – 71 (జైహరి), 69 (యదు హరి)
89. వికాస్ ఒబెరాయ్ – 1.45 బి. డాలర్లు, వయసు – 46
90. ఆనంద్ మహీంద్రా – 1.42 బి. డాలర్లు, వయసు – 61
91. సంజీవ్ గోయెంకా – 1.4 బి. డాలర్లు, వయసు – 55
92. మల్వీందర్ అండ్ శివేందర్ సింగ్ – 1.38 బి. డాలర్లు, వయసు – 43 (మల్వీందర్), 41 (శివేందర్)
93. సుందర్ జినోమాల్ – 1.35 బి. డాలర్లు, వయసు – 62
94. అజయ్ కల్సి – 1.31 బి. డాలర్లు, వయసు – 55
95. భవిన్ అండ్ దివ్యాంక్ తురాఖియా – 1.3 బి. డాలర్లు, వయసు – 36 (భవిన్), 34 (దివ్యాంక్)
96. దిలీప్ అండ్ ఆనంద్ సురానా – 1.29 బి. డాలర్లు, వయసు – 50 (దిలీప్), 45 (ఆనంద్)
97. ఆజాద్ మోపెన్ – 1.28 బి. డాలర్లు, వయసు – 63
98. షంషీర్ వయాలిల్ – 1.27 బి. డాలర్లు, వయసు – 39
99. రజ్జూ ష్రాఫ్ – 1.26 బి. డాలర్లు, వయసు – 83
100. శ్యామ్ అండ్ హరి భార్తియా – 1.25 బి. డాలర్లు, వయసు – 63 (శ్యామ్), 59 (హరి)

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

7 hours ago

Allari Naresh: Nervous But Happy With The Response

For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…

8 hours ago